VK Sasikala vs AIADMK: శశికళకు ఊహించని దెబ్బ.. ఆ చర్య సమర్థనీయమే అన్న కోర్టు..!

|

Apr 12, 2022 | 5:51 AM

VK Sasikala vs AIADMK: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఊహించని దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడం చట్టవిరుద్దమని శశికళ దాఖలు

VK Sasikala vs AIADMK: శశికళకు ఊహించని దెబ్బ.. ఆ చర్య సమర్థనీయమే అన్న కోర్టు..!
Sasikala
Follow us on

VK Sasikala vs AIADMK: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఊహించని దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడం చట్టవిరుద్దమని శశికళ దాఖలు చేసిన పిటిషన్‌ను చెన్నై కోర్టు కొట్టేసింది. కోర్టు చర్యతో.. అన్నాడీఎంకేపై తిరిగి పట్టు సాధించాలని అనుకున్న చిన్నమ్మకు గట్టి షాక్‌ తగిలినట్లయ్యింది. అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడం రాజ్యాంగ విరుద్దమని శశికళ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన చెన్నై సెషన్స్ కోర్ట్.. శశికళని పార్టీ నుంచి తొలగించడం చెల్లుతుందని కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నాడీఎంకే సెక్రటరీ జనరల్‌ పోస్ట్‌ను రద్దు చేస్తూ ఈపీఎస్ – ఓపిఎస్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం చెల్లుతుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు శశికళకి అన్నాడీఎంకే పార్టీతో సంబంధం లేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

2017లో పార్టీ నుంచి తనను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే పార్టీ సాధారణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆమె ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. పార్టీ కో-ఆర్డినేటర్‌ పన్నీర్‌సెల్వం, జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ పళనిస్వామి, లీగల్‌ వింగ్‌ జాయింట్‌ సెక్రెటరీ ఏఎం బాబు మురుగవేల్‌ ఇంటర్‌లోక్యూటరీ దరఖాస్తు దాఖలు చేయడంతో శశికళ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. 2017లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం..అప్పటి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వేటుపై శశికళ గతంలో చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని రెండు వర్గాల విలీనం తర్వాత కౌన్సిల్‌ భేటీ జరిగింది. శశికళను పార్టీ నుంచి జీవితకాలం పాటు బహిష్కరిస్తూ ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేలో చేరడానికి శశికళ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. పన్నీర్‌సెల్వంతో ఒకటి రెండుసార్లు ఆమె సమావేశం కూడా అయ్యారు. అయితే శశికళకు పార్టీలో ఎప్పటికి చోటు ఉండదన్నారు మాజీ సీఎం పళనిస్వామి.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..