సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రాచుర్యం పొందుతోన్న ప్రస్తుత తరుణంలో నాటకాలకు కూడా ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ముంబయిలో ప్రదర్శించిన మై నేమ్ ఈజ్ జాన్ నాటకమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. అర్పిచా ఛటర్జీ.. ‘మై నేమ్ ఈజ్ జాన్’ మ్యూజికల్ నాటకం అక్టోబర్ 27వ తేదీన ముంబయిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌కు హాజరైన టీవీ9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బరుణ్ దాస్ నిర్వాహకులపై ప్రశంసలు కురిపించారు. అబంతి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ 90 నిమిషాల మ్యూజిక్ ఫిలిమ్‌లో.. భారతదేశపు మొట్టమొదటి గ్రామఫోన్ రికార్డ్‌ను రికార్డ్ చేసిన కళాకారుడు గౌహర్ జాన్ కథను వివరించారు. ఈ నాటకానికి రక్తిమ్ గోస్వామి కొరియోగ్రఫీ అందించారు. హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషలతో ఈ నాటకనం సాగుతుంది.
ఇక నటుడు, రచయి మకరంద్ దేశ్‌పాండే టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మై నేమ్ ఈజ్ జాన్‌లో అర్పితా ఛటర్జీ సోలో పెర్ఫార్మెన్స్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అర్పితా ఇందులో అద్భుత నటనను కనబరించింది అన్నారు. తన అద్భుత నటనతో పాత్రకు ప్రాణం పోసిందని ప్రశంసలు కురిపించారు. ఆమెతో గంటన్నర పాటు మరో ప్రపంచానికి వెళ్లిన భావన కలుగుతుందని చెప్పుకొచ్చారు. కాగా ‘మై నేమ్ ఈజ్ జాన్’ మ్యూజికల్ సోలో రానున్న రోజుల్లో ఇతర ప్రాంతల్లో కూడా ప్రదర్శించనున్నారు. ఏయే తేదీల్లో ఎక్కడ ఈ నాటకం ప్రదర్శించనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
* 24 నవంబర్ 2024 – స్టాడ్‌థియేటర్, గ్ముండెన్, ఆస్ట్రియా
* 6 డిసెంబర్ 2024 – GD బిర్లా సభఘర్, కోల్‌కతా
* 17,18 జనవరి 2025 – శ్రీ రామ్ సెంటర్, ఢిల్లీ
* 24 జనవరి 2025 – హైదరాబాద్
* 8 ఫిబ్రవరి 2025 – కళా మందిర్, కోల్‌కతా
* 23 ఫిబ్రవరి GD, 2025 ఫిబ్రవరి కోల్‌కతా
* 13 ఏప్రిల్ 2025 – ది రోజ్, బ్రాంప్టన్, కెనడా
‘నా పేరు జాన్’ నాటకంకు సంబంధించి బుకింగ్ చేసుకోవాలనుకునే వారు. ప్రముఖ బుకింగ్ ప్లాట్‌పామ్ అయిన బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..