Prahlad Joshi: కొత్త వివాదంలో కాంగ్రెస్.. ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి..

|

Jul 26, 2024 | 7:08 PM

రామ్ నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాం నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.

Prahlad Joshi: కొత్త వివాదంలో కాంగ్రెస్.. ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి..
Prahlad Joshi
Follow us on

రామ్ నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాం నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది. దీనిని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ, మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా ఖండించారు. ఆ రాం నగర్ పరిధిలోకి వచ్చే బీజేపీ ఎంపీ మంజూనాథ్ కూడా పేరు మార్పును వ్యతిరేకించారు. దీనిపై కేంద్రానికి ఒక లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.

ఇదే సందర్భంగా కాంగ్రెస్ తీరుపై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుపైనా, రామమందిరం పట్ల వారికి ఉన్న అలర్జీని ఇది తెలియజేస్తోందన్నారు. తాము రామమందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు వారు అలాగే చేసేవారని గుర్తు చేశారు. అయితే అప్పుడు వారికి రామ మందిరం పట్ల వ్యతిరేకత ఉందనుకున్నాము కానీ.. రామ అనే పేరుపైనే వ్యతిరేకత ఉందని తాజాగా స్పష్టమైందన్నారు. దీన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రాం నగర్ పేరు మార్పు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తాను కోరుతున్నానన్నారు. కర్ణాటకలో దీనికి సంబంధించి తమ పార్టీ నేతలు నిరసనలు చేస్తారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..