అందుకే జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ బరుణ్ దాస్ వెల్లడి

|

Nov 21, 2024 | 10:36 PM

టీవీ-9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ జర్మనీలోని స్టట్‌గార్ట్‌ వేదికగా ప్రారంభమైంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు.

అందుకే జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ బరుణ్ దాస్ వెల్లడి
Tv9 Network Md & Ceo Barun
Follow us on

టీవీ-9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ జర్మనీలోని స్టట్‌గార్ట్‌ వేదికగా ప్రారంభమైంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు. అలాగే ఆయన నవంబర్ 22న ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా తన కీలక ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఇక ఆ ప్రసంగాన్ని రేపు రాత్రి తొమ్మిది గంటలకు టీవీ9 తెలుగులో లైవ్‌ చూడవచ్చు. న్యూస్ 9 అధ్వర్యంలో నవంబర్ 21 నుంచి 23 వరకు జరుగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌లో దేశ విదేశాల నుంచి ముఖ్య అతిధులు విచ్చేశారు. ఈ సమ్మిట్‌లో విధాన రూపకర్తలు, ఆవిష్కర్తలు, ఇతర ప్రముఖలను వేదికను పంచుకుంటారు.

“ఇండియా అండ్ జర్మనీ: సుస్థిర వృద్ధికి రోడ్‌మ్యాప్” అనే థీమ్ పేరిట నిర్వహిస్తోన్న ఈ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం, జర్మనీల మధ్య సత్సంబంధాలు, సహకారం మరింతగా పెరుగుతుందని ప్రముఖులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సమ్మిట్‌కు ముందు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ & సీఈఓ బరుణ్ దాస్.. న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్‌ను జర్మనీలో నిర్వహించడం వెనుక ఉన్న ఆలోచనను బహిర్గతం చేశారు. అదేంటో ఆయన మాటల్లోనే చూద్దాం..