Pak vs India: ఛీ ఛీ.. ఇక పాక్ బుద్ధి అస్సలు మారదు.. ఆపత్కాలంలోనూ నీచమైన చర్య..!

|

Feb 08, 2023 | 6:17 AM

కష్టాల్లో ఉంటే శత్రువైనా సరే ఆలోచించకుండా సహాయం చేసే లక్షణం భారత సమాజం గొప్ప లక్షణం. వరుస భూకంపాలతో పుట్టెడు కష్టాలతొ కొట్టుమిట్టాడుతున్న టర్కీ, సిరియా దేశాలను..

Pak vs India: ఛీ ఛీ.. ఇక పాక్ బుద్ధి అస్సలు మారదు.. ఆపత్కాలంలోనూ నీచమైన చర్య..!
Pakistan
Follow us on

కష్టాల్లో ఉంటే శత్రువైనా సరే ఆలోచించకుండా సహాయం చేసే లక్షణం భారత సమాజం గొప్ప లక్షణం. వరుస భూకంపాలతో పుట్టెడు కష్టాలతొ కొట్టుమిట్టాడుతున్న టర్కీ, సిరియా దేశాలను ఆదుకునేందుకు భారత్ ఆపన్నహస్తం అందిస్తుంటే.. మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేసి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది దయాది దేశం పాకిస్తాన్. టర్కీకి మానవతా సాయం అందించేందుకు సిద్ధమైన భారత్‌ను పాకిస్తాన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత్- పాక్ శతృత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్‌ ఇటీవల భారత్‌ విషయంలో వ్యవహరిస్తూ వచ్చిన శైలిని చూసి అక్కడ నేతల్లో కాస్తో కూస్తో మార్పొస్తుందేమో అనుకున్న భారతీయులు లేకపోలేదు. అయితే అవన్నీ అపోహలేనని తాజా ఘటనతో మరోసారి నిరూపితమయ్యింది. టర్కీలో సంభవించిన భూకంపం ధాటికి నిరాశ్రయులైన వారికి, క్షతగాత్రులకు సాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. అందులో భాగంగా భారతీయ వైమానిక విభాగం ఎన్డీఆర్ఎఫ్‌తో కలిసి డ్రిల్లింగ్ మెషీన్లు, రెస్క్యూ డాగ్స్, నిత్యావసరాలను, మందుల్ని ఓ ఎయిర్ క్రాఫ్ట్‌ను పంపింది.

సాధారణంగా టర్కీ వెళ్లాలంటే ఢిల్లీ నుంచి పాకిస్తాన్ మీదుగా వెళ్తే కాస్త దూరం తగ్గుతుంది. లేదంటే చుట్టూ తిరిగి వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే ఈ మానవతా సాయం అందించే విషయంలో సహకరించాలని పాకిస్తాన్ వైమానిక విభాగాన్ని భారత్ కోరింది. అయితే పాక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఎయిర్ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. ఇలా భారత్‌ను తమ ఎయిర్ స్పేస్‌లోకి రాకుండా అడ్డుకోవడం ఇటీవల ఇది రెండో సారి. గతంలో అప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత కూడా వారికి మానవతా సాయం అందించేందుకు ముందుకొచ్చింది ఇండియా. సుమారు 50 వేల టన్నుల గోధుమల్ని పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే తిరిగివచ్చే సమయంలో అప్పుడు కూడా పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్‌ను వాడుకునేందుకు అనుమతించలేదు. దీంతో ఇరాన్ ఎయిర్ స్పేస్‌ను ఉపయోగించుకుంది భారత వైమానిక దళం.

ఇవి కూడా చదవండి

మరోవైపు తాజా వివాదంపై స్పందించిన టర్కీ అంబాసిడర్.. ఈ విషయంలో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇప్పటి వరకు భారత్‌కు చెందిన 2 విమానాలు టర్కీ చేరుకున్నాయి. వాటిల్లో సహాయక సామాగ్రితో పాటు మొత్తం 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..