Parliament Monsoon Session: పార్లమెంటులో పెట్రో మంట.. సైకిల్‌పై వచ్చిన టీఎంసీ సభ్యులు..

|

Jul 19, 2021 | 12:44 PM

Parliamentary Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ..

Parliament Monsoon Session: పార్లమెంటులో పెట్రో మంట.. సైకిల్‌పై వచ్చిన టీఎంసీ సభ్యులు..
Parliament Monsoon Session
Follow us on

Parliamentary Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంటుకు సైకిల్‌పై వ‌చ్చారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి నిత్యం పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అనేక న‌గ‌రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 మార్క్ దాటింది. ఈ క్రమంలో పెరుగుతున్న పెట్రో ధరలను నిరసిస్తూ.. 61 సౌత్ అవెన్యూ నుంచి తృణ‌మూల్ ఎంపీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు వ‌చ్చారు. ఈ సందర్భంగా నినాదాలు చేసుకుంటూ పార్లమెంటుకు చేరారు.

లోక్‌సభ వాయిదా..
ఇదిలాఉంటే.. లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభకు వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో కొత్త మంత్రులను సభకు ప్రధాని మోదీ పరిచయం చేశారు. ఎక్కువమంది ఎస్సీలు, మహిళలు మంత్రులు కావడం శుభపరిణామంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు.

కాగా.. లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ఎంపీల డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకింగా ఆప్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతోపాటు నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ జరపాలని కాంగ్రెస్, సీపీఎం సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.

Also Read:

Narendra Modi: ప్రధాని నోట బాహుబలి మాట.. వ్యాక్సిన్ తీసుకుంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు: నరేంద్రమోదీ

Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌