EV Vehicles: ఎలక్ట్రానిక్‌ వాహన తయారీదారులపై కేంద్రం నజర్‌.. మూడు కంపెనీలకు భారీ జరిమానా..

|

Aug 13, 2022 | 4:48 PM

EV Vehicles: కాలుష్యం ఉగ్గారాలను తగ్గించే క్రమంలో విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీకి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగం భారీగా..

EV Vehicles: ఎలక్ట్రానిక్‌ వాహన తయారీదారులపై కేంద్రం నజర్‌.. మూడు కంపెనీలకు భారీ జరిమానా..
Follow us on

EV Vehicles: కాలుష్యం ఉగ్గారాలను తగ్గించే క్రమంలో విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీకి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలన్నీ ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోని బ్యాటరీలు పేలుతున్నాయన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని కంపెనీలకు చెందిన స్కూటర్ల బ్యాటరీలు పేలుతోన్న సంఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని టూ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగిస్తున్న బ్యాటరీల్లో లోపలనున్నట్లు గుర్తించారు. గతేడాది జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మూడు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీలపై భారీగా జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. నకిలీ బ్యాటరీలను వినియోగించిన కారణంగా కంపెనీలపై చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..