Loco Pilot: చనిపోదామనుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు.. కానీ లోకోపైలట్ ఏం చేశాడంటే..

| Edited By: Ravi Kiran

Jan 04, 2022 | 7:38 AM

ఆత్మహత్య చేసుకోవాలని రైలు ఎదురుగా వెళ్లాడో వ్యక్తి కానీ లోకోపైలట్‌ చురుగ్గా స్పందించడంతో అతడి ప్రాణాలు పోలేదు...

Loco Pilot: చనిపోదామనుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు.. కానీ లోకోపైలట్ ఏం చేశాడంటే..
Train
Follow us on

ఆత్మహత్య చేసుకోవాలని రైలు ఎదురుగా వెళ్లాడో వ్యక్తి కానీ లోకోపైలట్‌ చురుగ్గా స్పందించడంతో అతడి ప్రాణాలు పోలేదు. ఈ ఘటన మహారాష్ట్రంలో జరిగింది. వ్యక్తిని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన లోకోపైలట్ పై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రశంసలు కురిపించింది. దానికి సంబంధించిన ఫుటేజీని మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ముంబై దగ్గర్లోని సెవ్రీ స్టేషన్‌కు రైలు వచ్చే సమయానికి ఓ వ్యక్తి పట్టాలపై తచ్చాడుతూ కనిపించాడు. పట్టాలు దాటతాడేమో అనుకుంటుండగానే.. వాటిపై పడుకున్నాడు. మరోపక్క రైలు చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక ఆ వ్యక్తి బతకడం అసాధ్యమని అన్నారు. కానీ దగ్గరగా వచ్చిన రైలు ఆగిపోయింది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని లోక్‌పైలట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేక్‌ను వాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని పట్టాల మీద నుంచి పక్కకు తీసుకువచ్చారు.

ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటన నిన్న ఉదయం 11.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దానినిషేర్ చేస్తూ మంత్రిత్వ శాఖ లోకోపైలట్‌ను అభినందించింది.

Read Also.. Indian Railways: కరోనా మహమ్మారిలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్ల ద్వారా రూ.511 కోట్ల ఆదాయం..!