కేంద్ర ప్రభుత్వ సంస్థకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు..

|

Mar 21, 2022 | 4:51 PM

కేంద్ర ప్రభుత్వంపై బీజేపీయేతర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. విమర్శలకు దిగుతూనే.. కేంద్ర ప్రభుత్వ సంస్థలపై చర్యలకు దిగుతున్నాయి. ఇందులో భాగంగానే.. తొలిసారి తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు..

కేంద్ర ప్రభుత్వ సంస్థకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు..
Bsnl Office Seiz
Follow us on

కేంద్ర ప్రభుత్వంపై బీజేపీయేతర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. విమర్శలకు దిగుతూనే.. కేంద్ర ప్రభుత్వ సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే.. తొలిసారి తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజా కేంద్ర ప్రభుత్వ సంస్థకు నోటీసులు పంపించింది. తిండివనం మున్సిపాలిటీ(Tindivanam municipality)అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్( BSNL ) కార్యాలయంలో ఫర్నిచర్‌ను సీజ్ చేశారు. అనేక నోటీసుల తర్వాత కూడా పెండింగ్‌లో ఉన్న పన్నులను క్లియర్ చేయడంలో యాజమాన్యం విఫలమవడంతో ఈ చర్య తీసుకున్నట్లుగా వారు వెల్లడించారు. తిండివనం మున్సిపాలిటీకి చెందిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.., పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న BSNL కార్యాలయం స్థానిక మున్సిపాలిటీకి రూ. 8,70,090 పన్ను కట్టాల్సి ఉందని తెలిపారు. చెన్నై రోడ్‌లో అమర్చిన మొబైల్ ఫోన్ సిగ్నల్ టవర్‌కు రూ.7,24,446 పన్ను చెల్లించాలని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం పెండింగ్‌లో చెల్లింపులు చేయకపోవడంతో ఫర్నిచర్‌ను సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు మున్సిపాలిటీ అధికారులు.

శనివారం సాయంత్రం కమిషనర్ సౌందరరాజన్ నేతృత్వంలో మున్సిపాలిటీకి చెందిన అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి వచ్చి దండోరా వాయిస్తూ పెండింగ్‌లో ఉన్న పన్నుకు బదులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫర్నీచర్ సీజ్ చేసినట్లు ప్రకటించారు. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది ప్రతిఘటించి వాదించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులను తీసుకుని వచ్చిన మున్సిపాలిటీ అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంకు తాళం వేశారు. పెండింగ్‌లో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించకపోతే ఒకటి రెండు రోజుల్లో BSNL కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తిండివనం మున్సిపాలిటీ కమిషనర్ సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పన్నులు చెల్లించకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకోవల్సి వచ్చందని వెల్లడించారు. టాక్సులను ముందుగా చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని సూచించారు. తాజా పరిణామాలను కేంద్రం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలుగా పరిగణిస్తున్నారు ఆర్ధిక, రాజకీయ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?

Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..