ఆ రైతుకు ఐదుగురు ఆడపిల్లలే.. అందరూ కలెక్టర్లే.. తండ్రి కల నేరవేర్చిన కూతుళ్లు.. ఎక్కడంటే..

| Edited By: Rajitha Chanti

Jul 15, 2021 | 7:23 PM

ఆడపిల్ల పుడితే భారంగా భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. కూతురు పుట్టగానే కనికరం లేకుండా.. కన్న తల్లిదండ్రులే చంపేయడం..

ఆ రైతుకు ఐదుగురు ఆడపిల్లలే.. అందరూ కలెక్టర్లే.. తండ్రి కల నేరవేర్చిన కూతుళ్లు.. ఎక్కడంటే..
Ias Sisters
Follow us on

ఆడపిల్ల పుడితే భారంగా భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. కూతురు పుట్టగానే కనికరం లేకుండా.. కన్న తల్లిదండ్రులే నిర్మాష్యంగా చంపేయడం.. వదిలిపెట్టడం ఇటీవల చూస్తునే ఉన్నాం. ఇక కొందరు మాత్రమే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనుకుంటారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ కూతుర్లను మహారాణిలా చూసుకుంటుంటారు. ఒక ఆడపిల్ల పుడితేనే భారంగా భావించే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో ఒక సామాన్య రైతు..తన ఐదుగురు ఆడపిల్లను ఉన్నత విద్యలను చదివించాడు.. కొడుకులు లేరని కుంగిపోకుండా.. కూతుళ్లనే కొడుకులుగా భావించి తన కలను వారితో నెరవేర్చుకున్నాడు. కేవలం ఒక కూతురిని కాదు.. ఏకంగా ఐదుగురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాడు. ఎంతో కష్టపడి చదివించిన తమ తండ్రి కష్టాన్ని ఆ కూతుళ్లు సైతం ఊరికే పోనివ్వలేదు. ఆ ఐదుగురు ఆడపిల్లలు సరస్వతి బిడ్డలయ్యారు. ఏకంగా ఆ ఐదుగురు ఆడపిల్లలు కలెక్టర్ పదవులు అందుకుని తమ తండ్రి కలను నెరవేర్చి.. యువతకు ఆదర్శంగా నిలిచారు.

రాజస్తా్న్‏లోని హనుమాఘర్‏లో నివసించే శ్రీ సహదేవ్ సహరన్ సామాన్య రైతు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సహరన్‏కు ఐదుగురు ఆడపిల్లలే. అయినా సహరన్ మాత్రం కుంగిపోలేదు. ఐఏఎస్ కావాలన్న తన కల నేరవేర్చుకోలేకపోయానని.. తన కలను మీరు నేరవేర్చాలంటూ.. కూతుళ్లకు వివరించాడు. దీంతో కూతుళ్లు కూడా కష్టపడి చదివారు. 2018లో నిర్వహించిన రాజస్తాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించారు. హనుమఘర్‌కు చెందిన అన్షు, రీతు, సుమన్‌లు రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు(ఆర్‌ఏఎస్‌) ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఏఎస్‌కు ఎంపికవడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌ ఆర్‌ఏఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్‌ చేస్తూ ట్విటర్‌లో స్పందించారు. ఇది నిజంగా గర్వించదగిన విషయం. అన్షు, రీతు, సుమన్‌లు ఏకకాలంలో అడ్మినిస్టేటివ్‌ సర్వీస్‌కు ఎంపికవడం గొప్ప విషయం. తమ తండ్రికి.. కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్వీట్..

Also Read: Sammathame Movie: హీరో కిరణ్ అబ్బవరంను చూస్తూ ఉండిపోయిన చాందీని.. ఆకట్టుకుంటున్న “సమ్మతమే” ఫస్ట్‏లుక్ పోస్టర్‏..

Faria Abdullah: డ్యాన్స్‏తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

R Narayana Murthy: ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానంటా.. ఆ వార్తలు బాధ కలిగించాయి.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్..