Bengaluru: ‘దొంగ తెలివితేటలు’… పావురాలను ఎలా వాడుకున్నాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

|

Oct 09, 2024 | 6:58 PM

వివరాల్లోకి వెళితే.. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. పావురాలను ఉపయోగించుకొని తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో భాగంగానే బెంగళూరు పోలీసులు 38 ఏళ్ల మంజునాథ్‌ అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. నగరంలో జరిగిన దాదాపు 50 దొంగతరాల వెనకాల ఇతడి...

Bengaluru: దొంగ తెలివితేటలు... పావురాలను ఎలా వాడుకున్నాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే
Thief
Follow us on

దొంగతనం చేయాలంటే కూడా ఎంతో తెలివి ఉండాలని అంటుంటారు. అందుకే చొరకళ కూడా ఒకటని చెబుతుంటారు. పోలీసులు ఎంత చాకచక్యంతో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే దొంగలు అంత తెలివి మీరిపోతున్నారు. రకరకాల మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఓ దొంగ చూపించిన తెలివి చూస్తే ఔరా.. అంటూ నోరెళ్ల బెట్టాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. పావురాలను ఉపయోగించుకొని తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో భాగంగానే బెంగళూరు పోలీసులు 38 ఏళ్ల మంజునాథ్‌ అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. నగరంలో జరిగిన దాదాపు 50 దొంగతరాల వెనకాల ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉంటే విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పావురాలను ఉపయోగించుకొని సింపుల్‌ టెక్నిక్‌ను ఉపయోగించి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే తొలుత దొంగతనాలు చేయాలనుకుంటున్న అపార్ట్‌మెంట్లపైకి ఒక పావురాన్ని వదులుతాడు.

అనంతరం తాను పావురాలను పట్టుకునే వ్యక్తినని, పావురం పైన ఉందన్న సాకుతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే పావురాలను పట్టుకునేందుకు వచ్చానని చెప్పుతూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌లో తాళం వేసిన ఇంటిని గుర్తించి ఇనుపరాడ్‌తో తాళం పగలగొట్టి నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించే వాడు. ఇంట్లో ఉన్న నగలు, సొమ్ముతో దర్జాగా బయటకు వెళ్లేవాడు. అయితే ఇదంతా పగటిపూట, ప్రజలు పనుల్లో ఉన్నప్పుడే చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి…