ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

| Edited By:

Aug 13, 2020 | 1:19 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ.. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో..

ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ.. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా.. భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు నిత్యం కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో పలు ఉగ్ర సంస్థల రహస్య స్థావరాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా.. పుల్వామా జిల్లాలోని అవంతిపొర ప్రాంతంలోని బడ్రూ బర్సూ ఫారెస్ట్‌ ఏరియాలో కూంబింగ్ చేపడుతుండగా.. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఓ స్థావరం గుట్టురట్టయ్యింది. అందులో తనిఖీలు చేయగా.. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి బయటపడింది. ఉగ్రస్థావరంలో ఉన్న ఆయుధ సామాగ్రిని మొత్తాన్ని భద్రతా బలగాలు సీజ్ చేశాయి.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి