Bihar: ఆ డిప్యూటీ సీఏం మా అధికారులను బెదిరించారు.. బెయిల్ రద్దు చేయండి.. కోర్టును కోరిన CBI..

|

Sep 18, 2022 | 1:19 PM

IRCTC స్కామ్ కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న బీహార్ డిప్యూటీ సీఏం తేజస్వి యాదవ్ బెయిల్ రద్దు చేయాలంటూ CBI అధికారులు కోర్టును కోరారు. సీబీఐ అభ్యర్థన మేరకుCBI ప్రత్యేక కోర్టు తేజస్వీ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్..

Bihar: ఆ డిప్యూటీ సీఏం మా అధికారులను బెదిరించారు.. బెయిల్ రద్దు చేయండి.. కోర్టును కోరిన CBI..
Cbi
Follow us on

Bihar: IRCTC స్కామ్ కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న బీహార్ డిప్యూటీ సీఏం తేజస్వి యాదవ్ బెయిల్ రద్దు చేయాలంటూ CBI అధికారులు కోర్టును కోరారు. సీబీఐ అభ్యర్థన మేరకుCBI ప్రత్యేక కోర్టు తేజస్వీ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 28 లోపు స్పందించాలని ఆ నోటీసుల్లో తేజస్వీ యాదవ్ ను ఆదేశించింది. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో.. సీబీఐ అధికారులను బెదిరించేలా బీహార్ డిప్యూటీ సీఏం తేజస్వి యాదవ్ మాట్లాడారని సీబీఐ కోర్టుకు తెలిపింది. IRCTC హోటళ్ల మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో జరిగిన అవినీతికి సంబంధించిన కేసును సీబీఐ విచారించింది. ఈ కేసులో తేజస్వీ యాదవ్ కు, ఆయన తల్లి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి 2018 ఆగస్ట్ లో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. రాంచిలో, ఒడిశాలోని పురిలో ఉన్న IRCTC హోటళ్ల మెయింటనెన్స్ కాంట్రాక్ట్ కు సంబంధించి అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.

2006లో ఈ కాంట్రాక్ట్ ను ఇచ్చినందుకు గానూ తేజస్వీ కుటుంబం పట్నా లోని ప్రైమ్ లొకేషన్ లో మూడు ఎకరాల ప్లాట్ ను లంచంగా పొందారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కూడా చార్జిషీట్ నమోదు చేసింది. తమ అధికారులను బెదిరించేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, అందుకే తేజస్వి యాదవ్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..