Watch Video: స్టార్ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన 40 గదులు..

|

May 12, 2022 | 11:05 AM

Trichy Hotel Fire Accident: తమిళనాడు తిరుచ్చి టౌన్ లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచ్చి పాస్‌ పోర్ట్‌ ఆఫీస్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది.

Watch Video: స్టార్ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన 40 గదులు..
Trichy Fire Accident
Follow us on

Trichy Fire Accident: తమిళనాడు తిరుచ్చి టౌన్ లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచ్చి పాస్‌ పోర్ట్‌ ఆఫీస్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 8.30 గం.ల ప్రాంతంలో నాలుగో అంతస్థులో మంటలు చెలరేగగా.. అక్కడ బసచేస్తున్న కస్టమర్లు తమ గదులను ఖాళీ చేసి బయటకు పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు మిగిలిన అంతస్తులకు కూడా వ్యాపించాయి.  హోటల్‌లోని మూడు, నాలుగు అంతస్థులు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్ని కీలలు భారీగా ఎగిసి పడ్డాయి. హోటల్‌లో ఉన్న 40 రూమ్స్ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

అగ్ని ప్రమాదం జరిగిన హోటల్ నాలుగో అంతస్తులో అకౌంట్స్ విభాగం ఉంది. మంటల్లో అక్కడున్న డాక్యుమెంట్స్, ఫర్నీచర్ అంతా కాలిబూడిదయ్యాయి.  ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 20 మంది ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్ల సాయంతో  కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం మరేదైనా ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం.. బాలికపై పది మంది యువకుల గ్యాంగ్ రేప్

China: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్ అవుతున్న విమానంలో చెలరేగిన మంటలు