Jallikattu Stadium: దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఎక్కడో తెలుసా?

| Edited By: Balaraju Goud

Jan 24, 2024 | 5:31 PM

తమిళనాడులో సంక్రాంతిని, ఎద్దుల పోటీలను వేరు చేసి చూడలేం. జల్లికట్టు పోటీలకు తమిళనాడు రాష్ట్రం ప్రసిద్ధి. జల్లికట్టు అనేది తమిళులకు సంప్రాదయ కీడ. ఆ ఎద్దుల పొట్టీలనే జల్లికట్టు అంటారు.. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా చెప్పుకునే జల్లికట్టు పోటీల కోసం యావత్ తమిళనాడు ప్రజలు ఏడాదంతా ఎదురు చూస్తుంటారు.

Jallikattu Stadium: దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఎక్కడో తెలుసా?
Kalaignar Centenary Jallikattu Arena
Follow us on

తమిళనాడులో సంక్రాంతిని, ఎద్దుల పోటీలను వేరు చేసి చూడలేం. జల్లికట్టు పోటీలకు తమిళనాడు రాష్ట్రం ప్రసిద్ధి. జల్లికట్టు అనేది తమిళులకు సంప్రాదయ కీడ. ఆ ఎద్దుల పొట్టీలనే జల్లికట్టు అంటారు.. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా చెప్పుకునే జల్లికట్టు పోటీల కోసం యావత్ తమిళనాడు ప్రజలు ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. ఇక్కడ జల్లికట్టు పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే, పోటీలకు ఇప్పటివరకూ ప్రత్యేక మైదానాలు అంటూ ఏమీ లేవు. ఈ క్రమంలో జల్లికట్టు పోటీల కోసం ప్రత్యేక స్టేడియాన్ని నిర్మించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.

దక్షిణ తమిళనాడు కేంద్రంగా మధురై పరిసరాల్లో ఎక్కువగా జల్లికట్టు పోటీలు నెల రోజులపాటు జరుగుతుంటాయి. సంక్రాంతి నాడు మొదలయ్యే ఈ పోటీలు 30 రోజులకు పైగా జరుగుతాయి. ఈ పోటీలకోసం మూడు నెలల నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. పోటీల్లో పాల్గొనే యువకులు, ఎద్దుల జాబితాను సిద్ధం చేయడం ఒక ఎత్తయితే.. పోటీలు జరిగే ప్రాంగణం సిద్ధం చేయడం మరో ఎత్తు.. పోటీలు జరిగే ప్రతి చోట ప్రాంగణాల ఏర్పాటు కోసం సమయం, ఖర్చు మోపెడు అవుతోంది.. అది కూడా రక్షణ పూర్తి స్థాయిలో ఉండే పరిస్థితి లేదు. అందుకోసం తమిళనాడు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన జల్లికట్టు నిర్వహణ కోసం స్టేడియం నిర్మాణం చేయాలని నిర్ణయించింది.

తమిళనాడు ప్రభుత్వం మధురై వేదికగా రూ. 44 కోట్లు వెచ్చించి ప్రత్యేక స్టేడియాన్ని నిర్మించింది. స్టేడియంలో ఒక్కసారిగా 5 వేల మంది వీక్షించే అవకాశం ఉంది. నిర్మాణం పూర్తయిన స్టేడియం ను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారభించారు. ఆ వెంటనే జల్లికట్టు పోటీలు కూడా మొదలయ్యాయి. పోటీల్లో 600 ఎద్దులు పాల్గొనగా 400 మంది యువకులు వాటితో పోటీ పడ్డారు. ఈ స్టేడియంలో వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. జల్లికట్టు లాంటి సాహసోపేతమైన, ప్రమాదకరమైన పోటీలు జరగడమే అసాదరణమైతే అందుకోసం ప్రభుత్వమే స్టేడియం నిర్మించడం ఇంకా అరుదైన విషయం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేడియంలో ఎద్దులతో పోటీ పడి సత్తా చాటేందుకు యువ క్రీడాకారులు సిద్ధమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…