అన్నామలై సంచలన నిర్ణయం.. అమిత్‌షాకు 5 పేజీల రాజీనామా లేఖ.. ట్విస్ట్ ఇచ్చిన అధిష్ఠానం!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కె. అన్నామలై తన పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ సమర్పించారు. దాదాపు ఐదు పేజీలతో కూడిన ఈ లేఖలో ఆయన తన నిర్ణయానికి గల కారణాలను వివరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Bjp Leader Annamalai

Updated on: Jun 02, 2026 | 4:18 PM

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కె. అన్నామలై తన పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ సమర్పించారు. దాదాపు ఐదు పేజీలతో కూడిన ఈ లేఖలో ఆయన తన నిర్ణయానికి గల కారణాలను వివరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే, అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం తోసిపుచ్చింది. తమిళనాడులో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నాయకత్వం అవసరమని స్పష్టం చేసింది. ఆయన రాజీనామాను ఆమోదించని అధిష్ఠానం, పదవిలో కొనసాగాలని కోరినట్లు సమాచారం. విజయ్ తమిళగా వెట్రి కజగం (టీవీకే) ను ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తమిళనాడులో ఇది రెండవ ప్రధాన రాజకీయ పరిణామం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us