Mulayam Singh Yadav: ములాయం సింగ్ కోసం కిడ్నీ ఇస్తా.. ముందుకొచ్చిన పార్టీ నాయకుడు..

|

Oct 03, 2022 | 10:12 PM

సమాజ్ వాద్ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యం కారణంగా గురుగ్రామ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ములాయం సింగ్ త్వరగా కోలుకోవాలంటూ..

Mulayam Singh Yadav: ములాయం సింగ్ కోసం కిడ్నీ ఇస్తా.. ముందుకొచ్చిన పార్టీ నాయకుడు..
Mulayam Singh Yadav
Follow us on

సమాజ్ వాద్ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యం కారణంగా గురుగ్రామ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ములాయం సింగ్ త్వరగా కోలుకోవాలంటూ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆస్పత్రిలోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. లక్నోలోని విక్రమాదిత్య మార్గ్‌లోని ములాయం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న హనుమాన్‌ ఆలయంలో పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. వారణాసిలోని గిలాత్‌ బజార్‌లోని హనుమాన్‌ ఆలయం, లొహతియాలోని బడా గణేశ్‌ మందిరంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సందర్భంలో ములాయం సింగ్ ను బతికించుకోవడానికి కిడ్ని అవసరం అయితే తన కిడ్నీ ఇస్తానని సమాజ్ వాదీ పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు. తమ నాయకుడి కోసం ఎతంటి త్యాగాలకైనా తాము సిద్ధమని వెల్లడించారు.

సమాజ్‌వాదీ పార్టీ అధికారప్రతినిధి మనోజ్‌ రాయ్‌ మాట్లాడుతూ.. తామంతా ముద్దుగా పిలుచుకొనే ‘నేతాజీ’ ఆశీర్వాదం పార్టీలోని ప్రతిఒక్కరికీ అవసరమని.. వారణాసిలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు తెలిపారు. ములాయం సింగ్‌ యాదవ్ త్వరగా కోలుకోవాలంటూ షహ్రాన్‌పూర్‌లోనూ ప్రార్థనలు చేశారు. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. ములాయం సింగ్ యదవ్ చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలోకి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో ములాయం సింగ్ ను చూసేందుకు వస్తున్న ప్రజలకు సమాజ్ వాదీ పార్టీ కీలక విజ్ఞప్తి చేసింది. ఆస్పత్రి వద్దకు ఎవరూ రావొద్దని కోరింది. ప్రస్తుతం ఆయనకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స కొనసాగుతోందని, ‘నేతాజీ’ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పేర్కొంది. ఆస్పత్రికి వెళ్లినా ఆయన్ను కలవడం సాధ్యం కాదని.. అక్కడికి ఎవరూ వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..