Rahul Gandhi: రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి.. గోల్డ్‌ స్కామ్‌ను ప్రశ్నించినందుకే..

|

Jun 24, 2022 | 7:20 PM

Rahul Gandhi Office Vandalised: ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అద్దాలను పగులకొట్టారు.  ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు పట్టుకున్న కొందరు రాహుల్ గాంధీ వాయనాడ్ కార్యాలయం గోడ ఎక్కి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి.. గోల్డ్‌ స్కామ్‌ను ప్రశ్నించినందుకే..
Rahul Gandhi Office Vandali
Follow us on

కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ కార్యాయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కార్యాలయం లోకి దూసుకొచ్చిన కార్యకర్తలు రణరంగం సృష్టించారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అద్దాలను పగులకొట్టారు.  ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు పట్టుకున్న కొందరు రాహుల్ గాంధీ వాయనాడ్ కార్యాలయం గోడ ఎక్కి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలో పెద్ద ఎత్తున చొరబడిన దుండగులు.. రాహుల్ ఆఫీసులోని సిబ్బందిని చితకబాధారు.  రాహుల్ కార్యాలయంలో కొంత మంది విధ్వంసం చేస్తూ కొట్టుకుంటూ ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాంగ్రెస్ నేతలు ఖండించారు

ఇది పోలీసుల సమక్షంలోనే జరిగిందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఇది సీపీఎం నాయకత్వం చేస్తున్న స్పష్టమైన కుట్ర. దీనివెనుక సీఎం విజయన్‌ కుట్ర ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. గోల్డ్‌స్కామ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలను సీఎం జీర్ణించుకోలేకపోయారని..  అందుకే వారి కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 80-100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారని, వచ్చీ రావడంతోనే కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ ధ్వంసం చేయడం ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

దీనిపై సీఎం పినరయి విజయన్‌..

మరోవైపు, వాయనాడ్‌లోని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వయనాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా  రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ నిరంతరం ప్రశ్నిస్తోంది.

జాతీయ వార్తల కోసం