‘ఆశా దశ’ ,నిలకడగా కోవిడ్ సెకండ్ వేవ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తగ్గిన కేసులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

సెకండ్ వేవ్ కోవిడ్ ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇది మెల్లగా తగ్గుముఖం పట్టగలదని ఆశిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గినట్టు ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

  • Publish Date - 6:52 pm, Sat, 15 May 21 Edited By: Phani CH
'ఆశా దశ' ,నిలకడగా కోవిడ్ సెకండ్ వేవ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తగ్గిన కేసులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన
Second Covid Wave Stabilising Says Health Ministry

సెకండ్ వేవ్ కోవిడ్ ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇది మెల్లగా తగ్గుముఖం పట్టగలదని ఆశిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గినట్టు ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ నెల 3 నుంచి క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చిందని ఆయన చెప్పారు. యాక్టివ్ కేసులకన్నా రికవరింగ్ కేసులు పెరుగుతున్నాయని, అంటే ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తున్నాయని భావించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 6,500 కేసులు నమోదైనట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.గత వారం దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 21.9 శాతం ఉండగా ఇప్పడు ఇది 19.8 శాతం ఉందని ఆయన వివరించారు. డామన్ డయ్యులో కూడా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. 10 రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు 85 శాతం ఉన్నాయని, 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు, 8 రాష్ట్రాల్లో 50 వేలనుంచి లక్ష వరకు ఇలా క్రియా శీల కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా చాలావరకు ఈ కేసులు తగ్గుతున్నాయని, అయితే ప్రజలు కూడా ఇదివరకన్నా ఇప్పుడు కొంత అప్రమత్తమయ్యారని ఆయన పేర్కొన్నారు.

అటు ఫంగల్ కేసుల గురించి ప్రస్తావించిన ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.. దీని పరమాణువులు మట్టి లోను, గాలి తో బాటు చివరకు ఆహారంలో కూడా ఉంటాయని, అయితే ఇవి ఇన్ఫెక్షన్ కి దారి తీసేవి కావని వివరించారు. ప్రస్తుతం ఎయిమ్స్ లో 20 ఫంగల్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Shilpa Shetty: మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో సాగరకన్య.. కీలక పాత్రకోసం బాలీవుడ్ భామ..

International Day of Families: మొత్తం 38 మంది కుటుంబ సభ్యులు..ఒకే ఇల్లు..ఒకే వంట..భారతీయ ఉమ్మడి కుటుంబానికి సజీవ సాక్ష్యం