Viral: స్మశానవాటికలో చితిపై లేచిన శవం.. అవాక్కయిన జనం

|

Nov 22, 2024 | 5:49 PM

ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు గంటల పాటు బాడీని డీప్ ఫ్రీజర్‌లో పెట్టి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. ఆ పత్రాలతో పాటు బాడీని సంబంధిత సంస్థకు అప్పగించారు. తీరా మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లగా....

Viral: స్మశానవాటికలో చితిపై లేచిన శవం.. అవాక్కయిన జనం
Bhagwan Das Khetan Hospital
Follow us on

రాజస్థాన్‌లోని జుంజునులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజును జిల్లాలోని అతిపెద్ద ప్రభుత్వ భగవాన్ దాస్ ఖైతాన్ (BDK) ఆసుపత్రిలో ఒక రోగి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రెండు గంటలపాటు అతడి బాడీని డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచారు.  ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత మృతదేహాన్ని సంస్థ సభ్యులకు అప్పగించారు. అయితే అనూహ్యరీతిలో అంతిమ సంస్కారాల కోసం చితిపై పడుకోబెట్టినప్పుడు, అతని శరీరం కదలడం ప్రారంభించింది.

వెంటనే అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడిలో పల్స్ ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. విచారణ అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో జరిగింది.

ఈసీజీ రిపోర్టు చూసి చనిపోయాడని నిర్ధారణ

25 ఏళ్ల చెవిటి, మూగ వ్యక్తి రోహితాష్‌ సెప్టెంబర్ 2024 నుండి వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన తమ ఇనిస్టిట్యూట్‌లో ఉంటున్నట్లు మా సేవా సంస్థాన్‌ డైరెక్టర్‌ బన్వారీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అతని ఆరోగ్యం క్షీణించడంతో బీడీకే ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అతనికి సీపీఆర్ చేసి..  ఈసీజీ తీశారు. ఈసీజీ రిపోర్టు చూసి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. రోహితాష్ మృతదేహాన్ని మార్చురీలోని డీప్ ఫ్రీజర్‌లో సుమారు 2 గంటలపాటు ఉంచారు.

చితిపై పడుకోబెట్టిన తర్వాత కదలిక

బన్వారీ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5 గంటలకు పోస్ట్‌మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని వారికి అప్పగించారు. అంత్యక్రియల నిమిత్తం అతడ్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఇక్కడ, మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టినప్పుడు, అతడిలో కదలిక కనిపించింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే సంస్థ సిబ్బంది అతన్ని తిరిగి BDK ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం 6.24 గంటలకు రోహితాష్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.

 విచారణకు ఆదేశించిన కలెక్టర్

ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కలెక్టర్ రామావతార్ మీనా విచారణకు కమిటీ వేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ మహేంద్ర ముండ్, సామాజిక న్యాయం, సాధికారత శాఖ డిప్యూటీ డైరెక్టర్ పవన్ పూనియా కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఆసుపత్రిలో PMO డాక్టర్ సందీప్ పచార్ సమక్షంలో వైద్యుల సమావేశం అర్థరాత్రి వరకు కొనసాగింది. సమావేశం అనంతరం అధికారులంతా కలెక్టర్‌ వద్దకు తిరిగి వచ్చారు. అక్కడ కూడా సమావేశం కొనసాగింది. నివేదిక పరిశీలించిన కలెక్టర్.. బీడీకే ఆస్పత్రి పీఎంవో డాక్టర్ సందీప్ పచార్, డాక్టర్ యోగేష్ కుమార్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్‌లను సస్పెండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..