కోవిద్ మేనేజ్ మెంట్ పై శ్వేతపత్రం …..విడుదల చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ….విమర్శ కాదంటూనే …….!

| Edited By: Anil kumar poka

Jun 22, 2021 | 1:44 PM

కేంద్రం అనుసరిస్తున్న కోవిద్ మేనేజ్ మెంట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం శ్వేత పత్రం విడుదల చేశారు.ఇది విమర్శ కాదని, దేశంలో థర్డ్ కోవిద్ వేవ్ గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికేనని ఆయన అన్నారు. దీనినెదుర్కోవడానికి ముందే సంసిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.

కోవిద్ మేనేజ్ మెంట్ పై శ్వేతపత్రం .....విడుదల చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ....విమర్శ కాదంటూనే .......!
Rahul Gandhi
Follow us on

కేంద్రం అనుసరిస్తున్న కోవిద్ మేనేజ్ మెంట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం శ్వేత పత్రం విడుదల చేశారు.ఇది విమర్శ కాదని, దేశంలో థర్డ్ కోవిద్ వేవ్ గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికేనని ఆయన అన్నారు. దీనినెదుర్కోవడానికి ముందే సంసిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. తొలి, రెండో కోవిద్ వేవ్ ని అదుపు చేయడంలో కేంద్రం ఎలా ఎంత ఘోరంగా విఫలమయ్యిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఇందుకు కారణాలున్నాయని…వాటిని ఈ శ్వేత పత్రంలో వివరించామని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పట్ల ఎలా రియాక్ట్ అవాలన్నది ఈ బ్లూ ప్రింట్ లో వివరించినట్టు ఆయన తెలిపారు. సరైన ముందు చూపు ఉండి ఉంటే 90 శాతం మంది కోవిద్ రోగుల ప్రాణాలు కాపాడగలిగి ఉండేవారమని తగినంత ఆక్సిజన్ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. నిజానికి దేశంలో ఆక్సిజన్ కొరత లేదు.. కానీ మేనేజ్ మెంట్ సరిగా లేకపోవడం వల్లే ఈ కొరత ఏర్పడింది అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయని, కానీ ఆక్సిజన్ కాపాడిందని వ్యాఖ్యానించారు.

కనీసం ఇప్పటికైనా థర్డ్ వేవ్ పట్ల ఎంతయినా అప్రమత్తత అవసరం అని రాహుల్ చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న ఒక్కరోజే 82 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని, ఇది ప్రశంసనీయమని ఆయన చెప్పారు. కానీ ఇది ఒక్కరోజుతో ముగియరాదని, ప్రతి రోజూ నిర్విరామంగా కొనసాగాలని రాహుల్ సూచించారు. ఈ మా శ్వేత పత్రం చూసి అయినా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ..

మరిన్ని ఇక్కడ చూడండి: నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video

viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .

అమితాబ్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి..గుడిలోనే పూజారిని కొట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Viral Video.