రైతులకు కేంద్రం బిగ్‌ గుడ్‌న్యూస్‌.. గోధుమ సహా 6 పంటలకు మద్దతు ధర పెంపు..! ఏ పంటకు ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వం 2027-28 రబీ సీజన్‌కు ఆరు ప్రధాన పంటలైన గోధుమ, శనగ, బార్లీ, కందిపప్పు, ఆవాలు, కుసుమలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచింది. ఇది రైతులకు శుభవార్త, ముఖ్యంగా పెట్టుబడి, మార్కెట్ ధరలను పరిశీలిస్తున్న సమయంలో ఈ పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. కుసుమ MSPలో అత్యధిక పెంపు నమోదైంది. రైతుల ఆదాయంపై MSP ప్రభావం కీలకమైన అంశం.

రైతులకు కేంద్రం బిగ్‌ గుడ్‌న్యూస్‌..  గోధుమ సహా 6 పంటలకు మద్దతు ధర పెంపు..! ఏ పంటకు ఎంతంటే?
Rabi Msp Hike

Updated on: Oct 01, 2026 | 1:02 PM

కేంద్ర ప్రభుత్వం 2027-28 రబీ సీజన్‌కు ఆరు ప్రధాన పంటలైన గోధుమ, శనగ, బార్లీ, కందిపప్పు, ఆవాలు, కుసుమలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచింది. ఇది రైతులకు శుభవార్త, ముఖ్యంగా పెట్టుబడి, మార్కెట్ ధరలను పరిశీలిస్తున్న సమయంలో ఈ పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. కుసుమ MSPలో అత్యధిక పెంపు నమోదైంది. రైతుల ఆదాయంపై MSP ప్రభావం కీలకమైన అంశం.

రబీ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. 2027-28 రబీ మార్కెటింగ్ సీజన్‌ కోసం ఆరు ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచింది. రైతులు ఏ పంట సాగు చేయాలి, పెట్టుబడులు, మార్కెట్‌ ధరలు వంటి అంశాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ MSP పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి గోధుమ, శనగలతో పాటు బార్లీ, కందిపప్పు, ఆవాలు, కుసుమ పంటలకు కూడా MSP పెరిగింది. ఆరు పంటల్లో కుసుమ MSPలో అత్యధిక పెంపు నమోదైంది. 2026-27లో క్వింటాల్‌కు రూ.6,540గా ఉన్న కుసుమ MSPను రూ.675 పెంచి రూ.7,215గా నిర్ణయించారు. ఆవాలకు కూడా గణనీయమైన పెంపు లభించింది. గతంలో క్వింటాల్‌కు రూ.6,200గా ఉన్న MSPను రూ.413 పెంచి రూ.6,613కు చేర్చారు. పప్పుధాన్యాల్లో కందిపప్పు MSP రూ.390 పెరిగింది. 2026-27లో రూ.7,000గా ఉన్న కందిపప్పు MSP ఇప్పుడు రూ.7,390కు చేరింది. బార్లీ MSPను క్వింటాల్‌కు రూ.136 పెంచారు. దీంతో గతంలో ఉన్న రూ.2,150 నుంచి కొత్త MSP రూ.2,286కు చేరింది.

ఇక రైతులు ఎక్కువగా దృష్టి సారించే గోధుమ, శనగ పంటల కనీస మద్దతు ధరలోనూ పెంపు ఉంది. గోధుమ MSPను క్వింటాల్‌కు రూ.25 పెంచి రూ.2,610గా నిర్ణయించగా, శనగ MSPను రూ.83 పెంచి రూ.5,958కు చేర్చారు. మొత్తంగా రబీ సీజన్‌లో ఆరు ప్రధాన పంటలకు MSP పెంపు ద్వారా రైతులకు కనీస మద్దతు ధర పరంగా మార్పు చోటుచేసుకుంది. అయితే వాస్తవంగా రైతుల ఆదాయంపై ప్రభావం చూపేది మార్కెట్‌ ధరలు, దిగుబడి, సాగు ఖర్చులు, ప్రభుత్వ కొనుగోళ్ల పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us