Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

|

Oct 05, 2024 | 3:21 PM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ.. సావర్కర్‌పై అభ్యంతరక వ్యాఖ్యలు చేసినట్లుగా వినాయక్ దామోదర్ సావర్కర్‌ ముని మనవడు సత్యకి సావర్కర్‌ గతంలో పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
Rahul Gandhi (File Photo)
Image Credit source: PTI
Follow us on

పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మహారాష్ట్రలోని పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ.. సావర్కర్‌పై అభ్యంతరక వ్యాఖ్యలు చేసినట్లుగా ఆయన ముని మనవడు సత్యకి సావర్కర్‌ గత ఏడాది పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. హిందుత్వ సిద్ధాంతాలకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ కేసును జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీచేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న కోర్టు ఎదుట అక్టోబర్ 23న హాజరుకావాలని శుక్రవారం ఆదేశించింది.

ఐదారుగురు మిత్రులతో కలిసి ఓ ముస్లీం వ్యక్తిపై దాడి చేసి తాను సంతోషించినట్లు సావర్కర్ తన పుస్తకంలో పేర్కొన్నట్లు లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ గాంధీ చెప్పినట్లు సావర్కర్ జీవితంలో అలాంటి ఘటనన జరగలేదని సత్యకి సవార్కర్ స్పష్టంచేశారు. అలాంటిది ఏదీ సావర్కర్ తన పుస్తకాల్లో ఎక్కడా రాయలేదని స్పష్టంచేశారు. దురుద్దేశపూర్తకంగా రాహుల్ గాంధీ సావర్కర్‌పై ఈ వ్యాఖ్యలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు.

కోర్టు ఆదేశాల మేరకు దీనిపై విచారణ జరిపిన పూణె పోలీసులు.. సావర్కర్‌పై రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం వాస్తవమేనంటూ కోర్టుకు నివేధిక సమర్పించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. దీనిపై అక్టోబర్ 23న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసినట్లు సత్యకి సావర్కర్ తరఫు న్యాయవాది సంగ్రమ్ కోలాట్కర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి