వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా తన ఆస్తుల విలువ రూ. 12 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె తన వద్ద రూ. 4.27 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, అందులో మూడు బ్యాంకు ఖాతాల్లో వివిధ మొత్తాల డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, హోండా సీఆర్‌వీ కారు ఉన్నాయని వెల్లడించింది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా 1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల (స్థూల) బంగారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తన స్థిరాస్తులను రూ. 7.41 కోట్లుగా ప్రకటించింది. ఇందులో న్యూ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో రెండు సగం వాటాలు, అందులో ఉన్న ఫామ్‌హౌస్ భవనంలో సగం వాటా ఉన్నాయని, వీటి విలువ 2.10 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఆమెకు స్వీయ-ఆర్జిత నివాస ఆస్తి ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ. 5.63 కోట్లకు పైగా ఉందని ఆమె అఫిడవిట్‌లో పేర్కొంది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా వద్ద 39 కోట్ల రూపాయల చరాస్తులను ఉన్నాయి. ఆయనకు రూ.27.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
ప్రియాంక గాంధీ
రాబర్ట్ వాద్రా: