President of India Election 2022: రాష్ట్రపతి ఎన్నికలు అందుకే కీలకం.. ప్రస్తుతం ఎన్నోరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాన్నాయంటే..

|

Jul 18, 2022 | 1:29 PM

భారత రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సూచనల మేరకు రాష్ట్రపతి పనిచేయవల్సి ఉంటుంది. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి, సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం..

President of India Election 2022: రాష్ట్రపతి ఎన్నికలు అందుకే కీలకం.. ప్రస్తుతం ఎన్నోరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాన్నాయంటే..
President Of India Election
Follow us on

All presidents of India from 1950 to 2022: భారత రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సూచనల మేరకు రాష్ట్రపతి పనిచేయవల్సి ఉంటుంది. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి, సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే. భారతదేశంలో బ్రిటిష్‌ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న అధికరణాలు కేంద్ర కార్య నిర్వాహకశాఖ సభ్యుల ఎన్నిక, విధి విధనాలు ప్రస్తావిస్తాయి. ఈ శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. కేంద్ర కార్య నిర్వాహకశాఖకు రాష్ట్రపతి అధిపతిగా ఉంటారు. ప్రకరణ 53 ప్రకారం.. కేంద్ర కార్య నిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన కింది కార్యనిర్వాహక వర్గంలోని అధికారుల సహాయంతోగాని నిర్వర్తిస్తారు. 1950 నుంచి 2022 వరకు 17 మంది రాష్ట్రపతులు పనిచేశారు. ప్రస్తుతం 18వ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నిక విధానం
ప్రకరణ 324 ప్రకారం..కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 1952లో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది. 1974లో రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని రూపొందించారు. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడానికి ముందు 60 రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా రొటేషన్‌ పద్ధతిలో లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. రామనాథ్‌ కోవింద్‌ తర్వాత 16 రాష్ట్రపతి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రకరణ 54 ప్రకారం ఎలక్టోరల్‌ కాలేజ్‌ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన విధానసభలకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ, పుదుచ్ఛేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995 జూన్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. ప్రకరణ 55(3)లో రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రహస్య ఓటింగ్‌ నిర్వహిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఏకరూపతా, సామ్యతా సూత్రాల ప్రకారం ఎన్నుకుంటారు.

  1. మొదటి సూత్రం ప్రకారం.. రాష్ట్ర విధానసభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది.

ఎమ్మెల్యేల ఓటు విలువను గణించే పద్ధతి

ఇవి కూడా చదవండి
  • ఎమ్మెల్యే ఓటు విలువ = రాష్ట్రం మొత్తం జనాభా/ఎన్నికైన విధానసభ సభ్యుల సంఖ్య (1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు)
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 159
  • తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132
  • అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్‌–208, తమిళనాడు–176, జార్ఖండ్‌–176, మహారాష్ట్ర–175, బీహార్‌–173.
  • అతి తక్కువ ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: సిక్కిం–7, మిజోరాం–8, అరుణాచల్‌ప్రదేశ్‌–8, నాగాలాండ్‌–9.

2. రెండో సూత్రం ప్రకారం– దేశంలోని ఎంపీల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా తేడాలుండవు.

ఎంపీల ఓటు విలువను గణించే పద్ధతి
ఎంపీల ఓటు విలువ = మొత్తం రాష్ట్రాల శాసన సభ్యుల ఓటు విలువ/ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య (ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. దీనిలో మార్పు ఉండదు). ప్రస్తుతం లోక్‌సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 543, రాజ్యాసభ సభ్యుల సంఖ్య 233.

1950 నుంచి 2022 వరకు భారత రాష్ట్రపతిగా కొనసాగిన వారు..

1. డా. రాజేంద్రప్రసాద్‌: జనవరి 26, 1950 నుంచి మే 13, 1962 వరకు
2. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌: మే 13, 1962 నుంచి మే 13, 1967 వరకు
3. డా. జాకీర్‌ హుస్సేన్‌: మే 13, 1967 నుంచి మే 3, 1969 వరకు
4. వరాహగిరి వెంకట గిరి: మే 3, 1969 నుంచి జులై 20,1969 వరకు
5. మహమ్మద్‌ హిదయతుల్లా: జులై 20, 1969 నుంచి ఆగస్టు 24, 1969 వరకు
6. వరాహగిరి వెంకట గిరి: ఆగస్టు 24, 1969 నుంచి ఆగస్టు 24,1974 వరకు
7. ఫకృద్దీన్ అలీ అహ్మద్: ఆగస్టు 24, 1974 నుంచి ఫిబ్రవరి 11, 1977 వరకు
8. బసప్ప దానప్ప జట్టి: ఫిబ్రవరి 11, 1977 నుంచి జులై 25, 1977 వరకు
9. నీలం సంజీవ రెడ్డి: జులై 25, 1977 నుంచి జులై 25, 1982 వరకు
10. జ్ఞాని జైల్ సింగ్: జులై 25, 1982 నుంచి జులై 25, 1987 వరకు
11. రామస్వామి వెంకటరామన్‌: జులై 25, 1987 నుంచి జులై 25, 1992 వరకు
12. శంకర్‌ దయాళ్‌ శర్మ: జులై 25, 1992 నుంచి జులై 25, 1997 వరకు
13. కె.ఆర్. నారాయణన్: జులై 25, 1997 నుంచి జులై 25, 2002 వరకు
14. డా.ఏపీజే అబ్దుల్‌ కలాం: జులై 25, 2002 నుంచి జులై 25, 2007 వరకు
15. ప్రతిభా పాటిల్‌: జులై 25, 2007 నుంచి జులై 25, 2012 వరకు
16. ప్రణబ్ ముఖర్జీ: జులై 25, 2012 నుంచి జులై 25, 2017 వరకు
17. రామనాథ్‌ కోవింద్‌: జులై 25, 2017 నుంచి నేటి వరకు (ప్రస్తుతం 18వ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి)

ముఖ్యమైన విషయాలు
అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అయిన వారు: నీలం సంజీవరెడ్డి
అతి పెద్ద వయస్సులో రాష్ట్రపతి అయిన వారు:కె.ఆర్‌.నారాయణన్‌
రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు: ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌
ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులయినవారు: నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్‌సింగ్, శంకర్‌ దయాళ్‌ శర్మ
రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి: హిదయతుల్లా
ఏ రాష్ట్రం నుంచి అత్యధిక రాష్ట్రపతులు ఎన్నికయ్యారు: తమిళనాడు
తమిళనాడు నుంచి రాష్ట్రపతులైనవారు: సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ , ఆర్‌.వెంకట్రామన్‌ , ఎ.పి.జె అబ్దుల్‌ కలాం