PM-JAY: ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పరిధి మరింత విస్తరణ.. వెల్లడించిన డాక్టర్ వీకే పాల్

|

Oct 21, 2021 | 9:01 PM

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ అన్నారు.

PM-JAY: ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పరిధి మరింత విస్తరణ.. వెల్లడించిన డాక్టర్ వీకే పాల్
Dr.VK Paul
Follow us on

PM-JAY: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో, ఈ పథకం అభివృద్ధికి అనేక అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని డాక్టర్ పాల్ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ను పెంచుతుందని ఆయన అన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదేవిధంగా నీతి(NITI) ఆయోగ్ నిర్వహించిన కార్యక్రమం FICCI HEAL 2021 ప్రారంభ సెషన్‌లో ప్రసంగిస్తూ డాక్టర్ పాల్ ఈ విషయం చెప్పారు.

పీఎం-జెఏవై పథకాన్ని ప్రభుత్వం మెరుగుపరుస్తూనే ఉంటుందని డాక్టర్ పాల్ చెప్పారు. ”ఇప్పటివరకు దానిలో భాగం కాని సంస్థలు కూడా దానితో భాగస్వామి కావాలి. మిగిలిన ఆసుపత్రులను పీఎం-జెఏవైలో చేర్చడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. క్లిష్టమైన వైద్యం, అత్యవసర వైద్య రంగంలో దేశం విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. దీని కోసం, నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఎక్సలెంట్ ఎమర్జెన్సీ, ట్రామా సిస్టమ్‌ను సృష్టించాల్సిన అవసరం ఉంది. దీని కోసం పరిశ్రమ సహాయం అవసరం.” అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ రెట్టింపు అవుతుంది

రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌ను పెంచాలని యోచిస్తున్నాయని, ప్రస్తుత 4.5 శాతం నుండి 8 శాతానికి పెంచాలని అవి యోచిస్తున్నట్లు డాక్టర్ పాల్ చెప్పారు. ఇది ఆరోగ్య సంరక్షణ స్థితిని మెరుగుపరుస్తుంది. వచ్చే ఏడాది బడ్జెట్ కోసం ప్రైవేట్ రంగానికి సూచనలు ఇవ్వాలని.. ఆయుష్ లేదా దేశంలోని సాంప్రదాయ వైద్య రంగాన్ని ఎలా బలోపేతం చేయాలో అలాగే ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలి

డాక్టర్ పౌల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ, మరిన్ని జిల్లా ఆసుపత్రులను మెడికల్ కళాశాలలుగా మార్చే అవకాశంపై దృష్టి పెట్టాలని, తద్వారా మానవ వనరులను పెంచడంలో సహాయపడుతుందని అన్నారు. డిఎన్‌బి విద్యపై దృష్టి పెట్టాలని ప్రైవేట్ రంగానికి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. తద్వారా దేశంలో మెరుగైన నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..