Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’.. కీలక అంశాలపై ప్రసంగించనున్న ప్రధాని మోదీ

|

Jul 25, 2021 | 9:18 AM

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదివారం ఉదయం

Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’.. కీలక అంశాలపై ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Pm Narendra Modi
Follow us on

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతినెలా జరిగే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 79వ ఎపిసోడ్‌లో భాగంగా మోదీ పలు కీలక విషయాలపై ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం.. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, న్యూసోనైర్ మొబైల్ యాప్‌లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా టోక్యో ఒలింపిక్స్ కి వెళ్లిన భారత క్రీడాకారులను ఉద్దేశించి మాట్లడనున్నారు. పలు పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాల గురించి కూడా మాట్లాడనున్నారు.

దీంతోపాటు కరోనా మహమ్మారిపై కూడా మట్లాడే అవకాశం ఉంది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ గురించి కూడా మోదీ మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కరోనా వ్యాక్సిన్ విషయంలో నెలకొన్న సందేహాలను కూడా మోదీ నివృత్తి చేయనున్నారు. చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి సందేహిస్తున్న క్రమంలో మోదీ ప్రసంగం కీలక మారుతుందని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా థర్డ్ వేవ్, వ్యాక్సిన్ తీసుకోవడం వలన కలిగే రక్షణ ప్రయోజనాలను తెలియజేయనున్నారు.

ఇదిలాఉంటే.. “మన్ కి బాత్” కార్యక్రమం ప్రతినెలా చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 78 ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. ఈ ‘మన్ కి బాత్’ లో పీఎం మోదీ ప్రధానంగా ప్రజలకు సంబంధించిన విషయాలపై, సమస్యలపై ప్రసంగిస్తారు.

Also Read:

Fraud: మామూలోడు కాదు.. నకిలీ పెయిడ్‌ లీవ్స్‌తో రూ.10 కోట్లు స్వాహా చేసిన ప్రభుత్వ ఉద్యోగి

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; నిరాశ పరిచిన మనూ బాకర్, యషస్విని దేస్వాల్