ఢిల్లీలోని నరైనాలో జరిగిన లోహ్రి వేడుకలకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఉత్తర భారతావని ప్రాముఖ్యమైన ఈ లోహ్రి పండుగను.. అక్కడి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వ్యవసాయం, కష్టించి పనిచేసే రైతులకు ముడిపడిన ఈ పండుగ.. అందరిలోనూ ఆశను చిగురుస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
నరైనాలో జరిగిన లోహ్రి వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళలు పాల్గొన్నారని ప్రధాని మోదీ అన్నారు. “ప్రతి ఒక్కరూ ఆనందంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని.. ముందంతా సంపన్నమైన పంటల సీజన్‌ను కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే ప్రతీ ఒక్కరికి సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు చెప్పారాయన.
Highlights from a special Lohri in Naraina… pic.twitter.com/MQloHvfQuM
— Narendra Modi (@narendramodi) January 13, 2025
మరోవైపు సోమవారం కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు, నటుడు చిరంజీవి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ అంశంపైనా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తన మంత్రివర్గ సహచరుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాయని.. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని చూశానని పేర్కొన్నారు.
Some more glimpses from the Lohri programme in Delhi. pic.twitter.com/bMbGuLwR3i
— Narendra Modi (@narendramodi) January 13, 2025
నా మంత్రివర్గ సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారి నివాసంలో జరిగిన సంక్రాంతి,పొంగల్ వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించాను.
భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతిని,పొంగల్ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతిలోనూ,వ్యవసాయ సంప్రదాయాలలోనూ… pic.twitter.com/C9GazmQKBq
— Narendra Modi (@narendramodi) January 13, 2025