PM Modi ISRO: జై కిసాన్.. జై జవాన్.. జై విజ్ఞాన్.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ..

|

Updated on: Aug 26, 2023 | 10:02 AM

PM Modi in ISRO Highlights: భారత కీర్తి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప ప్రయోగం.. చంద్రయాన్ సూపర్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఫలించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. నింగికేగిన చంద్రయాన్‌ – 3 భారత కీర్తి పతాకను దశదిశలా చాటింది.

PM Modi ISRO: జై కిసాన్.. జై జవాన్.. జై విజ్ఞాన్.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ..
PM Modi

PM Modi in ISRO, Bengaluru Highlights: భారత కీర్తి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప ప్రయోగం.. చంద్రయాన్ సూపర్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఫలించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. నింగికేగిన చంద్రయాన్‌ – 3 భారత కీర్తి పతాకను దశదిశలా చాటింది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ ఇవాళ.. నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి వారిని అభినందించనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఏథెన్స్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్న ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఇస్రో కార్యాలయానికి వెళ్లి చంద్రయాన్-3 బృందంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇస్రో స్టేషన్ల నుంచి చంద్రయాన్ 3 శాస్త్రవేత్తలు బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Aug 2023 08:53 AM (IST)

    సరికొత్త చరిత్ర..

    అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 సరికొత్త చరిత్రను లఖించిందని.. ప్రపంచంలోనే భారత్ అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని ప్రధాని తెలిపారు.

  • 26 Aug 2023 08:35 AM (IST)

    చంద్రయాన్2 లునార్ ల్యాండింగ్ ప్రదేశానికి..

    అనంత విశ్వంలో ప్రజ్ఞాన్ రోవర్ శంఖానదం పూరించిందని ప్రధాని పేర్కొన్నారు. చంద్రయాన్2 లునార్ ల్యాండింగ్ ప్రదేశానికి తిరంగాగా పిలువనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

  • 26 Aug 2023 08:31 AM (IST)

    యువతకు స్ఫూర్తిదాయకం..

    చంద్రయాన్-3 యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోడీ తెలిపారు. చంద్రయాన్2 వైఫల్యంతో వెనకడుగు వేయలేదని.. రెట్టింపైన ఉత్సహాంతో పనిచేశారంటూ ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

  • 26 Aug 2023 08:28 AM (IST)

    ఇకనుంచి నేషనల్ స్పేస్ డే..

    అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆగస్టు 23న ఏటా నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

  • 26 Aug 2023 08:18 AM (IST)

    చంద్రునిపై కూడా త్రివర్ణ పతాకం ఎగురుతుంది..

    ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రునిపై కూడా త్రివర్ణ పతాకం ఎగురుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంలో మహిళా శక్తి పాత్ర ఎంతో ఉందని తెలిపారు.

  • 26 Aug 2023 08:13 AM (IST)

    ఆ ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తాం..

    చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 23 ఆగస్టు నా కళ్ల ముందు ఇప్పటికీ తచ్ఛాడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

  • 26 Aug 2023 08:11 AM (IST)

    భారత్ సరికొత్త చరిత్ర..

    అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని ప్రధని మోడీ పేర్కొన్నారు. ఇస్రో సాధించింది.. మామూలు విజయం కాదని.. దేశం మొత్తం గర్విస్తుందంటూ పేర్కొన్నారు.

  • 26 Aug 2023 08:04 AM (IST)

    ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు శుభాకాంక్షలు..

    బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌ చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

  • 26 Aug 2023 08:02 AM (IST)

    మనసంతా ఇక్కడే ఉంది..

    చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నానని.. కానీ మనసంతా ఇక్కడే ఉందంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తుందన్నారు.

  • 26 Aug 2023 08:00 AM (IST)

    శాస్త్రవేత్తలను అభినందించిన మోడీ..

    చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న ఇస్రో బృందంలోని శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు.

  • 26 Aug 2023 07:42 AM (IST)

    నన్ను నేను ఆపుకోలేకపోయాను..

    చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘నేను దేశంలో లేనందున నన్ను నేను ఆపుకోలేకపోయాను.. భారత్ కు వెళ్లగానే నేను మొదట బెంగళూరు సందర్శించి, మన శాస్త్రవేత్తలను కలవాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు.

  • 26 Aug 2023 07:39 AM (IST)

    జై విజ్ఞాన్ జై అనుబంధ్..

    బెంగళూరు విమానాశ్రయంలో ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘జై విజ్ఞాన్ జై అనుబంధ్’ నినాదం గురించి ప్రస్తావించారు.

  • 26 Aug 2023 07:26 AM (IST)

    బెంగళూరు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం

    సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) -శ్రీహరికోట, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)-తిరువనంతపురం, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC)-అహ్మదాబాద్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తిరువనంతపురం సహా 18 ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తల బృందం బెంగళూరు చేరుకుంది. ఇస్రో చీఫ్, మిషన్ డైరెక్టర్లను ప్రధానమంత్రి మోడీ వ్యక్తిగతంగా అభినందించే అవకాశం ఉంది. సెప్టెంబరు 2న ప్రయోగించనున్న ఆదిత్య L-1 మిషన్, గగన్‌యాన్ గురించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ISRO, ISTRAC ల్యాండర్ విక్రమ్, రోవర్ తాజా ఫుటేజిని ప్రధాని పరిశీలించే అవకాశం ఉంది. ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో ప్రధాని పర్యటనను దేశంలోని అన్ని ఇస్రో స్టేషన్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

  • 26 Aug 2023 07:24 AM (IST)

    మోడీకి ఘనస్వాగతం

    ప్రధాని మోడీకి బెంగళూరులో ఘనస్వాగతం లభించింది. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయం వెలుపల గుమిగూడిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభివాదం చేశారు.

Published On - Aug 26,2023 7:22 AM

Follow us
అన్న అమన్ బాటలో నడుస్తా.. దేశానికి బంగారు పతకం తెస్తా: అమిత్
అన్న అమన్ బాటలో నడుస్తా.. దేశానికి బంగారు పతకం తెస్తా: అమిత్
క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా..
క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా..
తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం .. సమయం ఎప్పుడంటే
తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం .. సమయం ఎప్పుడంటే
ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం..
ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం..
ఏసీ వాడకంలో ఈ పొరపాట్లు చేస్తే భారీ నష్టం.. అవేంటో తెలుసుకోండి!
ఏసీ వాడకంలో ఈ పొరపాట్లు చేస్తే భారీ నష్టం.. అవేంటో తెలుసుకోండి!
ఈ 9 ఏళ్ల చిన్నారి కుంగ్ కుంగ్ ఫూ స్టార్.. షాకింగ్ వీడియో వైరల్
ఈ 9 ఏళ్ల చిన్నారి కుంగ్ కుంగ్ ఫూ స్టార్.. షాకింగ్ వీడియో వైరల్
కేబినెట్ సబ్‌-కమిటీలపై రాజకీయ రగడ.. పేలుతున్న మాటల తూటాలు..
కేబినెట్ సబ్‌-కమిటీలపై రాజకీయ రగడ.. పేలుతున్న మాటల తూటాలు..
ప్రపంచంలో టాప్ 10 సంపన్న దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..
ప్రపంచంలో టాప్ 10 సంపన్న దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
హైదరాబాద్ సీపీ పేరిట.. ఏకంగా రూ. 43 లక్షలు ఊడ్చేసిన..
హైదరాబాద్ సీపీ పేరిట.. ఏకంగా రూ. 43 లక్షలు ఊడ్చేసిన..
క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా..
క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా..
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..
300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..