భారత్ సహా మరో 4 దేశాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. 

TV9 Telugu

10 August 2024

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారతదేశం ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటుంది.

ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం పొందిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే కాదు.

భారతదేశం సహా మరో ఐదు దేశాలు ఈ రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

1960 ఆగస్టు 15న కాంగో స్వాతంత్ర్యం పొందిన ఆగస్టు 15న రిపబ్లిక్ ఆఫ్ కాంగో తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

లీచ్టెన్‌స్టెయిన్ ఐరోపాలో అతి చిన్న దేశం. ఇది 1866 ఆగస్టు 15న జర్మన్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది.

1945 ఆగస్టు 15న జపాన్ నుండి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా విముక్తి పొందాయి. ఈ రెండు దేశాలు ఆరోజున జాతీయ విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

బహ్రెయిన్ 1971 ఆగస్టు 15న UK నుండి స్వాతంత్ర్యం పొందింది. అయితే బహ్రెయిన్ ఆగస్టు 16ని జాతీయ దినోత్సవంగా జరుపుకుంతుంది.

ఆగష్టు 15న ఐదు దేశాలు వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందాయి. అయితే నాలుగు దేశాలు మాత్రమే అధికారికంగా జరుపుకుంటాయి.