PM Modi: ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల జర్నీ.. ప్రధాని మోదీ పొగడ్తలు..

|

Oct 12, 2024 | 8:37 PM

శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన వార్షిక విజయదశమి ర్యాలీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. దేశం, ప్రపంచం, సమాజంలోని వివిధ సమస్యలపై ఆయన కీలకంగా మాట్లాడారు. ఇక ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసినందుకు గానూ..

PM Modi: ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల జర్నీ.. ప్రధాని మోదీ పొగడ్తలు..
Pm Modi & Rss Chief
Follow us on

శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన వార్షిక విజయదశమి ర్యాలీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. దేశం, ప్రపంచం, సమాజంలోని వివిధ సమస్యలపై ఆయన కీలకంగా మాట్లాడారు. ఇక ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసినందుకు గానూ.. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ సేవకు అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక మైలురాయి అందుకున్న స్వచ్చంద సేవకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. దేశం పట్ల మీ సంకల్పం, అంకితభావం ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించడంలో కొత్త శక్తిని నింపుతుంది. ఈరోజు విజయదశమి శుభ సందర్భంగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని వినండి’ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు.

1925వ సంవత్సరంలో విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్చే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను స్థాపించారు. ఆ ఏడాది సెప్టెంబర్ 27న ఏర్పాటైన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది సంవత్సరంలో సమాజం, వాతావరణంలో సామరస్యం, సద్భావన కోసం పాటుపడుతుందని మోహన్ భగవత్ ప్రసంగంలో తెలిపారు. గత కొన్నేళ్లుగా భారత్ చాలా బలంగా తయారైంది. ప్రపంచంలో భారత్ విశ్వసనీయత పెరిగిందని, దుష్ట కుట్రలు దేశ దృఢత్వాన్ని పరీక్షిస్తున్నాయన్నారు. భారతదేశం మరింత పటిష్టంగా ఆవిర్భవించిందని, ప్రపంచ వ్యాప్తంగా దేశ ఖ్యాతి పెరిగిందని మోహన్ భగవత్ అన్నారు. ఏ దేశమైనా దాని ప్రజల జాతీయ స్వభావాన్ని బట్టి గొప్పగా మారుతుంది. ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే RSS శతాబ్దిలోకి అడుగుపెట్టింది. ఆకాంక్షలు, ఆశలతో పాటు భారతదేశంలో సమస్యలు, సవాళ్లు కూడా ఉన్నాయి. దేశం, సంస్కృతి, మతం, సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేసిన దయానంద్ సరస్వతి, అహల్యాబాయి హోల్కర్, బిర్సా ముండా తదితరులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.