భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది, మోదీ యూఎస్ పర్యటనలో క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడం, UN జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో ప్రసంగించడంతోపాటు అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అమెరికా పర్యటనలో చివరి రోజు బిజీబిజీగా గడిపారు ప్రధాని మోదీ.. అమెరికా టెక్ కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
ప్రధాని మోదీ తన అద్భుతమైన పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వస్తున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ ఎజెండా అనేక ముఖ్యమైన కార్యక్రమాలతో నిండిపోయింది. మొదటి రోజు, ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాతో జో బిడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్, డెలావేర్‌లో సమావేశమయ్యారు. అక్కడ నలుగురు నాయకులు క్వాడ్ సమ్మిట్‌కు హాజరయ్యారు. సమావేశం సందర్భంగా, జనరల్ అటామిక్స్ తయారు చేస్తున్న 31 MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలుపై బిడెన్, మోదీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా, రక్షణ హార్డ్‌వేర్ సరఫరాను పెంచడం గురించి కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కాగా, అమెరికాకు స్మగ్లింగ్ చేసిన 297 పురాతన వస్తువులను బిడెన్ ప్రధాని మోదీకి తిరిగి ఇచ్చారు.
క్వాడ్ సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియా, జపాన్ నాయకులతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. పరస్పర ప్రయోజనం కోసం సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో చర్చలు జరిగాయి. క్వాడ్ సమ్మిట్‌లో, సహకారం, అనుసంధానం ద్వారా అభివృద్ధికి భారతదేశం నిబద్ధతను మోదీ నొక్కిచెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్‌తో పోరాడటానికి క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్ చొరవను కూడా సమ్మిట్ ప్రకటించింది. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడటానికి భారతదేశం 7.5 మిలియన్ డాలర్లను సాయం చేసకోవాలని క్వాడ్ దేశాలు నిర్ణయించాయి.
మోదీ పర్యటన రెండో రోజుగా న్యూయార్క్‌కు తీసుకెళ్లారు. అక్కడ భారీ సంఖ్యలో హాజరైన భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ఆర్ఐ కొలీజియంలో 13 వేల మందికి పైగా అమెరికన్-భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతదేశ భవిష్యత్తు గురించి ప్రధాని మోదీ తన దృష్టిని ప్రదర్శించారు. ఇదిలా ఉండగా, తన అమెరికా పర్యటనలో రెండో రోజున, బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో కొత్త కాన్సులేట్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారతదేశం-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ వారి పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని భారతదేశ బ్రాండ్ అంబాసిడర్‌లుగా పిలుస్తున్నారు. న్యూయార్క్‌లో, మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను కూడా కలుసుకున్నారు. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి కోసం భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు. భారతదేశం వృద్ధి అవకాశాలను, వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంభావ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ.. అగ్రశ్రేణి US టెక్ కంపెనీల CEO లతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన చివరి రోజు తయారీ, ఆవిష్కరణకు భారత్‌ను గమ్యస్థానంగా చూడాలని అమెరికన్ టెక్ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు. భారత్‌తో కలిసి అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తి చేయాలని సూచించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజాలతో సమావేశమయ్యారు. అసెంచర్, అడోబ్, గూగుల్, IBM సహ 15 ప్రఖ్యాత కంపెనీల CEOలు, ఛైర్మన్లు ఇందులో పాల్గొన్నారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్ హాంగ్ సహా 15 కంపెనీల సీఈవోలు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. పలు టెక్ కంపెనీల సీఈవోలతో సక్సెస్‌ఫుల్‌గా చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించామని మోదీ తెలిపారు. మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రపంచంలో మేటి కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి ఒకే వేదికపై కూర్చోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ. భారత్‌లో సమర్ధవంతమైన డిజిటల్ ఏకోసిస్టమ్ ఉంది. భారత్ స్టార్టప్ హబ్‌గా ఉంది.. ప్రపంచంలో యూత్ టాలెంట్ కూడా భారత్ లోనే ఎక్కువగా ఉంది. పదేళ్ల నా పాలన చూసి ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. పెట్టుబడులు పెట్టే వారిని భారత్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన పాలసీలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉన్న మరిన్ని అవకాశాలను తాము అన్వేషిస్తామని గూగుల్ CEO సుందర్ పిచాయ్ అన్నారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టెక్ దిగ్గజాలతో కలిసి పిచాయ్ పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా విజన్‌తో భారతదేశాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ దృష్టి సారించారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు మోదీ.. యుఎన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్‌లో కీలక ఉపన్యాసం చేశారు.
This has been a fruitful USA visit, covering diverse programmes and focusing on a series of subjects aimed at making our planet better. Here are the highlights. pic.twitter.com/JXKS0XKDps
— Narendra Modi (@narendramodi) September 24, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..