Pakistan: పాక్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో ‘ఎమర్జెన్సీ’ విధింపు.. ఆగని అత్యాచారాల పర్వం!

|

Jun 22, 2022 | 12:23 PM

పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని (Emergency) విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు ఘణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్‌ హోం శాఖ మంత్రి..

Pakistan: పాక్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ విధింపు.. ఆగని అత్యాచారాల పర్వం!
Gender Violence
Follow us on

Emergency in Pakistan’s Punjab province: పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని (Emergency) విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు ఘణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్‌ హోం శాఖ మంత్రి అట్టా తరార్ సోమవారం మీడియాకు తెలిపారు. రోజుకు 4 నుంచి 5 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులు పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంటోంది. అత్యాచార కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించిందని, ప్రభుత్వం ఈ విధమైన (అత్యాచారాలు) కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో సివిల్‌ సొసైటీ, ఉమెన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకురావాలని మంత్రి కోరారు. దీనిలో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకోవడంలో దృష్టి నిలపాలని సూచించారు. ప్రభుత్వం కూడా యాంటీ-రేప్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిందని, దీనిపై విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

నేరాలకు పాల్పడిన వారిలో అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెండు వారాల్లో ఒక సిస్టంను అమల్లోకి తీసుకువస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం156 దేశాలలో లింగ అసమానతల్లో పాకిస్తాన్ 153వ స్థానంలో ఉంది. ఇరాక్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెల్పింది.

ఇవి కూడా చదవండి

ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్స్ అండ్ సెక్యూరిటీ (IFFRAS)లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. గత నాలుగేళ్లలో పాకిస్తాన్‌లో మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి 14,456ల కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధిక కేసులు పంజాబ్‌లోనే చోటుచేసుకున్నాయి. ఇవేకాకుండా పనిచేసే ప్రదేశాల్లో, గృహాల్లో మహిళలపై వివక్ష ఎక్కువయ్యినట్లు నివేదికలు తెల్పుతున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా దాదాపు 5,048 పని ప్రదేశాల వేధింపు కేసులు నమోదయ్యాయి. 2019లో 4,751 కేసులు, 2020లో 4,276 కేసులు, 2021లో 2,078 కేసులు నమోదయ్యినట్లు మానవ హక్కుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెల్పుతున్నాయి. సమాజంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ స్త్రీ పట్ల చులకన భావనకు ప్రధాన కారణమని కొందరు సామాజిక వేత్తలు అభ్రిప్రాయపడ్డారు.