Violation at India-Pak Border: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో రెచ్చిపోయిన పాక్ దళాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ..

|

May 03, 2021 | 1:59 PM

Violation at India-Pak Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

Violation at India-Pak Border: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో రెచ్చిపోయిన పాక్ దళాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ..
Indian Army
Follow us on

Violation at India-Pak Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణ నెలకొల్పేందుకు ఇరు దేశాలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం తరువాత సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ తొలిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.

‘పాకిస్తాన్ రేంజర్స్ రామ్‌ఘర్ సెక్టార్‌లో సరిహద్దుల వెంబడి కాల్పులు జరిపారు’ అని జమ్మూ సరిహద్దు బిఎస్ఎఫ్ ఎన్స్‌పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జమ్వాల్ వెల్లడించారు. అయితే, ఈ కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. ఫెన్సింగ్‌ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న దళాలపై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయన్నారు. అయితే, కాల్పుల విరమణపై పాక్, భారత్‌ మధ్య ఎన్నిసార్లు ఒప్పందాలు జరిగినా.. పాకిస్తాన్ మాత్రం వాటిని పాటించిన దాఖలు లేవనే చెప్పాలి. అనేకసార్లు పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భద్రతా దళాలపై కాల్పులకు తెగబడుతూనే ఉన్నాయి. అయితే, భారత ఆర్మీ కూడా పాక్‌కు ధీటుగానే సమాధానం చెబుతూ పాక్‌ను తగిన బుద్ధి చెబుతూ వస్తోంది.

Also read:

Gold Price: బంగారం ప్రియులకు షాక్‌..రాబోయే రోజుల్లో రూ. 60 వేలకు చేరనున్న బంగారం ధర.. నిపుణులేమంటున్నారు..!

Grenade: పాలసీసాలు అనుకుని తీసుకోబోయారు.. కానీ..అవి రెండో ప్రపంచ యద్ధకాలం నాటి బాంబులు

Instagram New Feature: సరికొత్త ఫీచర్ తీసుకురానున్న ఇన్‌స్టాగ్రమ్.. యూజర్లకు డబ్బులే డబ్బులు..!