శోభనం రాత్రి ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన వరుడు.. క్షణాల వ్యవధిలోనే భార్యను వదిలి పరుగెత్తుకొచ్చాడు..

| Edited By: Ram Naramaneni

Apr 04, 2021 | 9:04 PM

Honeymoon: ఏ యువతీ యువకుడికి అయినా వారి జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టం వివాహం అని చెప్పొచ్చు. వివాహం తరువాత...

శోభనం రాత్రి ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన వరుడు.. క్షణాల వ్యవధిలోనే భార్యను వదిలి పరుగెత్తుకొచ్చాడు..
Bride And Groom
Follow us on

Honeymoon: ఏ యువతీ యువకుడికి అయినా వారి జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టం వివాహం అని చెప్పొచ్చు. వివాహం తరువాత వ్యక్తుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో ప్రతీ జంట తమ వివాహ వేడుక మొదలు, హనీమూన్‌ని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. అయితే, హనీమూన్‌ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భార్య, భర్తకు తన భాగస్వామి గురించి ఊహించని విషయం తెలిసిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? తన భాగస్వామితో కాపురం చేయలేం అని తెలిస్తే వారి రియాక్షన్ ఏలా ఉంటుంది? అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ వరుడికి.. మొదటి రాత్రి రోజే గొంతులో వెలక్కాయ పడినట్లుగా అయ్యింది.

అసలు విషయంలోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో పంకి(23) అనే యువకుడికి ఓ యువతితో రెండేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన అనంతరం.. పెద్దలు ఆ నవ జంటకు శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన యువకుడు.. అసలు విషయం తెలిసి బెడ్ రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే తేరుకుని గదిలోంచి పెద్దగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తాను పెళ్లి చేసుకున్న యువతి హిజ్రా, తనను మోసం చేశారంటూ వాపోయాడు. విషయం తెలుసుకున్న వారంతా షాక్ అయ్యారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశారని, హిజ్రాను తనకిచ్చి పెళ్లి చేశారంటూ యువకుడు వాపోయాడు. తనను మోసం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో వైద్యులు సైతం సదరు యువతిలో సాధారణ యువతులలో ఉండే లక్షణాలు లేవని తేల్చి చెప్పారు. చివరికి ఆ యువతిని తిరిగి ఆమె ఇంటికి తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకుని పంపించేశారు.

అయితే, అంతా బాగుందనుకునే సమయంలో.. ఆ యువతి కుటుంబ సభ్యులు మళ్లీ వివాదాన్ని రాజేశారు. తమ కూతురును ఇంటికి తీసుకెళ్లాలంటూ యువకుడిపై, అతని కుటుంబంపై ఒత్తిడి చేశారు. యువతి చేత అతనిపై పోలీసు ఫిర్యాదు కూడా చేయించారు. కాగా, యువతిని తీసుకెళ్లకపోతే దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు యువకుడు ఆరోపించాడు. మొత్తానికి ఈ వ్యవహారం మళ్లీ పోలీస్ మెట్లు ఎక్కడంతో పోలీసులు తలపట్టుకున్నారు. విడాకులు తీసుకోవాలనుకుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. కాగా, ఈ వ్యవహారం శివపురి జిల్లాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.

వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్….

Also read: West Bengal: ఊపందుకున్న బెంగాల్‌ ఎన్నికల ప్రచారం.. మార్కెట్లో హల్‌చల్‌ చేస్తోన్న మోదీ, మమతా స్వీట్‌ విగ్రహాలు

RTC Bus Fire : రోడ్డుపై వెళ్తోన్న ఆర్టీసీ వాల్వో బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, ప్రమాద సమయంలో బస్సులో 15 మంది

బెంగుళూరు డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు.. బయటపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పేర్లు..!