Children Repair Road: చిట్టి చేతులు పెద్ద పనులు చేశాయి.. వ్యవస్థనే కదిలించేలా చేశాయి. ఏం చేశారో చూడండి..

|

Jul 29, 2021 | 7:18 AM

Children Repair Road: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని చూస్తూ కూర్చోలేదు ఆ చిన్నారులు. తమ గ్రామంలో ఉన్న సమస్యను తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. చేతులు చిన్నవే అయినా...

Children Repair Road: చిట్టి చేతులు పెద్ద పనులు చేశాయి.. వ్యవస్థనే కదిలించేలా చేశాయి. ఏం చేశారో చూడండి..
Odisha Childrens
Follow us on

Children Repair Road: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని చూస్తూ కూర్చోలేదు ఆ చిన్నారులు. తమ గ్రామంలో ఉన్న సమస్యను తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. చేతులు చిన్నవే అయినా పెద్ద పనిని భుజాన వేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని భాద్రాక్‌కు సమీపంలో ఉన్న బాగ్మారా అనే గ్రామంలో రోడ్డు పూర్తిగా పాడైపోయింది. అధికారులు ఎంతకీ పట్టించుకోకపోవడంతో ఆ గ్రామంలో ఉన్న కొందరు చిన్నారులు రాళ్లను ఏరుతూ రోడ్లను వేసే ప్రయత్నం చేశారు. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

అలా వైరల్‌గా మారిన ఈ వీడియో అధికారుల దృష్టిలో పడింది. ఈ విషయంపై స్పందించిన భాద్రా బీడీఓ అధికారి మనోజ్‌ బెహెరా మాట్లాడుతూ.. ‘బాగ్మారాలో జరిగిన విషయాన్ని మేము ధృవీకరించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఈ సంఘటన నిజమే అయితే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు. ఇక అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆ ప్రదేశాన్ని సందర్శించి స్థానికల అభిప్రాయాలను తీసుకొని ఒక రిపోర్ట్‌ను రూపొందిస్తారని తెలిపిన మనోజ్‌.. రోడ్డు మరమ్మత్తు పనులను మొదలు పెడతామని తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. తమ పనితో వ్యవస్థనే కదిలించిన ఈ చిన్నారులు నిజంగానే గ్రేట్‌ కదూ!

Also Read: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

ఇంట్లో కూర్చుని రూ.15 లక్షలు గెలుచుకోండి.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏం చేయాలో తెలుసా?

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్‌