‘పదవి కాదు, దేశం ముఖ్యం’. కపిల్ సిబల్ సెటైర్

కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం 'తాత్కాలికంగా' పరిష్కారమయ్యాక తాజాగా ఈ పార్టీ నేత కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై సెటైరిక్ గా స్పందిస్తూ ట్వీట్లు చేశారు. తను పదవులకోసం పాకులాడలేదని..

'పదవి కాదు, దేశం ముఖ్యం'. కపిల్ సిబల్ సెటైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 25, 2020 | 7:03 PM

కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ‘తాత్కాలికంగా’ పరిష్కారమయ్యాక తాజాగా ఈ పార్టీ నేత కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై సెటైరిక్ గా స్పందిస్తూ ట్వీట్లు చేశారు. తను పదవులకోసం పాకులాడలేదని, ఇది తన దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు.  లేఖ నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ రాహుల్ గాంధీ నిన్నటి పార్టీ  వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మేము భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అంటున్నారని, అయితే రాజస్థాన్ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ తాను వాదించానన్నారు. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మన పార్టీకి మద్దతుగా నిలిచానని, గత 30 ఏళ్లుగా కాషాయ పార్టీకి సపోర్టుగా ఏనాడూ మాట్లాడలేదని ఆయన వివరించారు. అయినా ఇంకా బీజేపీతో కుమ్మక్కయ్యామని ఎలా అంటారని కపిల్ సిబల్ ప్రశ్నించారు.

మొత్తానికి తానలా అనలేదని రాహుల్ నన్ను వ్యక్తిగతం కలిసి చెప్పగానే ఈ ట్వీట్ ను తొలగించాను అన్నారు.