New IT Minister warning: ఇక్కడ చట్టమే సుప్రీం.. ట్విట్టర్‌కు కొత్త ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వార్నింగ్

|

Jul 08, 2021 | 3:35 PM

కేంద్ర ఐటీశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న వెంటనే ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేల‌పై రూపుదిద్దుకున్న చ‌ట్టాలే అత్యున్నత‌మ‌ని ట్విట్టర్‌ను ఉద్దేశించి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు.

New IT Minister warning: ఇక్కడ చట్టమే సుప్రీం.. ట్విట్టర్‌కు కొత్త ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వార్నింగ్
New It Minister Warning To
Follow us on

కేంద్ర ఐటీశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న వెంటనే ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేల‌పై రూపుదిద్దుకున్న చ‌ట్టాలే అత్యున్నత‌మ‌ని ట్విట్టర్‌ను ఉద్దేశించి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. కొత్త ఐటీ రూల్స్‌ను ట్విట్టర్ ఖచ్చితంగా పాటించాల్సిదే అని అన్నారు. ఇటీవ‌ల ట్విట్టర్ సంస్థకు, కేంద్ర ప్రభుత్వం మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే..మాజీ ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్ కూడా ప‌లు మార్లు ట్విట్టర్‌కు ఇదే స్థాయిలో హెచ్చరించారు. కానీ ట్విట్టర్ మాత్రం దారిలోకి రాలేదు. త‌న వైఖ‌రిని మార్చుకోకపోగా.. మంత్రి ట్విట్టర్‌నే కొన్ని గంటలపాటు బ్లాక్ చేసింది.

గురువాంర ఢిల్లీ హైకోర్టులోనూ ట్విట్ట‌ర్ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. 8 వారాల్లోగా గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్‌ను నియ‌మించ‌నున్నట్లు ఆ సంస్థ కోర్టుకు చెప్పింది. రూల్స్ పాటించ‌డం లేద‌ని కోర్టు హెచ్చరించిన రెండు రోజుల త‌ర్వాత ట్విట్టర్ ఈ విష‌యాన్ని వెల్లడించింది. గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్‌ను పెట్టాల‌ని కేంద్రం కోరినా.. ట్విట్టర్ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. కావాల్సినం స‌మ‌యం ఇవ్వలేమ‌ని హైకోర్టు జ‌స్టిస్ రేఖా పాలి త‌న తీర్పులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

 Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..