Nairobi Flies: మనవాళిపై వైరస్ లు, క్రిమికీటకాదులు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన ఏడాది నుంచి వరసగా.. రకరకాల వైరస్ లు మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. కేరళలో టొమాటో ఫ్లూ ,ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ 100 మంది విద్యార్థుల్లో నైరోబి ఫ్లై ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య సిబ్బంది పేర్కొన్నారు. సిక్కింలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఇన్ఫెక్షన్ కేసు తెరపైకి రావడంతో కలకలం రేగింది. స్థానిక ఆరోగ్య అధికారులు మాట్లాడుతూ.. ఈ నైరోబి ఫ్లై వైరస్ కేసులు ఎక్కువగా తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన ఓ విద్యార్థి చేతికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నైరోబీ ఫ్లై అంటే ఏమిటో, అది ఇన్ఫెక్షన్ను ఎలా వ్యాపిస్తుంది, ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి…
నైరోబీ ఫ్లై అంటే ఏమిటి?
వీటిని కెన్యాన్ ఫ్లై లేదా డ్రాగన్ ఫ్లై అని కూడా అంటారు. ఇది రొయ్యల ఆకారంలో ఉంటుంది. వాటిలో రెండు ప్రధాన జాతులు ఉన్నాయి. నారింజ, నలుపు. ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ ఫ్లైస్ సాధారణంగా ఎక్కువ వర్షాలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తాయి. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన వర్షపాతం అధికంగా ఉండడంతో అవి అక్కడ తిరుగుతున్నాయి. ఆహారం కోసం ఈగలు కొత్త ప్రదేశాలకు చేరుకుని ఇన్ఫెక్షన్ను వ్యాపిస్తాయి. గత కొన్ని వారాలుగా ఇవి సిక్కింలో కనిపిస్తున్నాయి. ఇతర కీటకాలు, చిమ్మటల వలె, ఇవి కూడా కాంతి వైపు ఆకర్షితులవుతాయి.
మనుషులకు ఎలా సోకుతుందంటే?
సాధారణంగా ఈ ఫ్లై మానవులను కుట్టదు. అయితే చర్మంపై వాలిన తర్వాత ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం పేరు పెడెరిన్. చర్మంపై ఈ రసాయనం పడిన వెంటనే మంట పెడుతున్న అనుభూతి వస్తుంది. ఒకొక్కసారి ఈ పరిస్థితి తీవ్రంగా కూడా ఉండవచ్చు.
చర్మం ఎర్రగా మారుతుంది. దురద, దద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఈగ చర్మంపై వాలిన 24 గంటల తర్వాత కనిపించడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో 48 గంటల తర్వాత, చర్మంపై బొబ్బలు, దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి.
ఎప్పుడు సీరియస్ అవుతుందంటే?
రోగి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది.. ఈగ చర్మంపై ఎంత పాడ్రిన్ విడుదల చేసింది.. ఎంతసేపు కూర్చొని ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈగ ఎక్కువ విషాన్ని (రసాయన) వ్యాపించి, అది శరీరం అంతటా వ్యాపించి ఉంటే, అప్పుడు జ్వరం, నరాల నొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కళ్లను రుద్దితే విష రసాయనం కళ్లలోకి చేరి కండ్లకలకకు కారణమవుతుంది. వైద్య భాషలో దీనిని నైరోబీ ఐ అంటారు. అటువంటి పరిస్థితిలో.. రోగికి తాత్కాలికంగా కళ్ళు చూపు మందగించవచ్చు.
ఎలా రక్షించుకోవాలి?
దీని బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉదాహరణకు, దోమతెరలో నిద్రించండి. ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి.. రాత్రిపూట ఆరుబయట ప్రదేశాలలో నిదురించకుండా ఉండడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ఫ్లై మీ చర్మం పై వాలితే.. బ్రష్ సహాయంతో దాన్ని తీసివేయండి. ఆ బ్రష్ ను ఎప్పుడూ మళ్ళీ వినియోగించవద్దు.
నైరోబి ఫ్లై అత్యధిక ఇన్ఫెక్షన్ కేసులు 1998లో కెన్యా , తూర్పు ఆఫ్రికాలో నమోదయ్యాయి. ఆ ఏడాది అధిక వర్షాల కారణంగా దీని కేసులు తెరపైకి వచ్చాయి. ఆఫ్రికాతో పాటు, భారతదేశం, జపాన్, ఇజ్రాయెల్ లో కూడా ఈ కేసులు కనిపించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..