Mukesh Ambani: ముఖేష్ అంబానీని చంపేస్తామంటూ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు.. కట్ చేస్తే అర్థరాత్రి ఆపరేషన్‌లో..

|

Oct 07, 2022 | 5:04 PM

భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అపర కుబేరుడిగా పేరు గడించిన ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీని చంపేస్తామంటూ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు.. కట్ చేస్తే అర్థరాత్రి ఆపరేషన్‌లో..
Mukesh Ambani(File Photo)
Follow us on

భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అపర కుబేరుడిగా పేరు గడించిన ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో అంబానీ సంపద భారీగా పెరుగుతోంది. ప్రపంచ స్థాయి ధనవంతులతో పోటీపడుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ముఖేష్ అంబానీకి, ఆయన కుటుంబానికి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి ముఖేష్ అంబానీని, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒకసారి కాదు.. ఇలా రెండుసార్లు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్ చేసిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు డీబీ మార్గ్ పోలీసులు. బీహార్‌కు చెందిన రాజేష్ మిశ్రా(30) ఈ బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ముఖేష్ అంబానీకి చెందిన దక్షిణ ముంబైలోని ఇంటితో పాటు, ఆస్పత్రిని కూడా పేల్చివేస్తామంటూ రాజేష్ కాల్ చేసి బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. రాజేష్ నిరుద్యోగ సమస్యతో ఒత్తిడిలో ఉన్నాడని, ఆ మానసిక సమస్యతోనే అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఫోన్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే, అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. బీహార్ నుంచి కాల్ వచ్చినట్లు ఐడెంటిఫై చేసిన ముంబై పోలీసులు.. బీహార్ పోలీసుల సహకారంతో అర్థరాత్రి ఆపరేషన్ చేపట్టి దర్భంగాలో ఉంటున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ అలా బెదిరింపు కాల్స్ ఎందుకు చేశాడనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందులో ఉగ్రకుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మొత్తంగా చూసుకుంటే.. గత కొన్నేళ్ల నుంచి ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. అంబానీని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగులు కాల్స్ చేయడం, బెదిరించడం చేస్తున్నారు. గతంలో ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా కార్లు నిలిపి ఉండటం, అందులో పేలుడు పదార్థాలు ఉండటం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ముఖేష్ అంబానీ ఇంటి వద్ద, ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రతను భారీగా పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..