తల్లీకూతుళ్లపై దారుణ కాండ.. వైద్యం చేస్తానని నమ్మించి.. ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి..

|

Dec 23, 2022 | 8:22 AM

ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి వచ్చిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ.. ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని చికిత్స చేస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన...

తల్లీకూతుళ్లపై దారుణ కాండ.. వైద్యం చేస్తానని నమ్మించి.. ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి..
Crime News
Follow us on

ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి వచ్చిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ.. ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని చికిత్స చేస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె చికిత్సకు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి.. ఆ వ్యక్తిని నిలదీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అతను ఓవర్ డోస్ ఇంజెక్షన్ తో దారుణంగా హత్య చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కాగ్రాపీఠ్ కర్ణ ఈఎన్టీ హాస్పిటల్ లో మన్సుఖ్ అనే వ్యక్తి కాంపౌండర్​గా పని చేస్తున్నాడు. 15 సంవత్సరాలుగా అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ హాస్పిటల్ కు భారతీ బెన్ అనే మహిళ చెవి నొప్పి సమస్యతో బాధపడుతూ తన తల్లి చంపాబెన్ తో కలిసి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చెవికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకు గానూ రూ.30వేలు ఖర్చు అవుతుందన్నారు. వారి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో వారు చికిత్స చేయించుకోకుండా వెనుదిరిగారు.

వాళ్ల ఆర్థిక బలహీనతను ఆసరాగా తీసుకున్న కాంపౌండర్ మన్సుఖ్.. రూ. 5వేలకే ఆపరేషన్​ చేస్తానని నమ్మించాడు. తక్కువ మొత్తంలో ఆపరేషన్ అయిపోతుందన్న సంతోషంతో ఆ తల్లీకూతుళ్లు ఒప్పుకున్నారు. దీంతో డాక్టర్​లేని టైమ్ లో మన్సుఖ్ భారతీ బెన్​కు ట్రీట్ మెంట్ చేశాడు. కాంపౌండర్. ఒక చెవికి చికిత్స బాగానే చేసినా.. మరో చెవికి వైద్యం చేసే సమయంలో వైద్యం వికటించి ఆమె చనిపోయింది. తల్లి భారతీ బెన్ నిలదీయడంతో ఆమెకు ఓవర్ డోస్ ఇంజక్షన్ ఇచ్చి దారుణంగా హత్య చేశాడు. డెడ్ బాడీలను ఆస్పత్రి అల్మారాలో ఉంచాడు.

మృతదేహాలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. మన్సుఖ్ ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా తేల్చారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిచంగా నేరాన్ని అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..