Narendra Modi Birthday: ప్రధాని మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికలు కావాలా..? అయితే ఇలా చేయండి..

| Edited By: Subhash Goud

Sep 17, 2021 | 6:20 AM

PM Narendra Modi Birthday: ప్రధాని నరేంద్రమోదీ నేటితో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని 20 రోజులపాటు వేడుకలను నిర్వహించేందుకు

Narendra Modi Birthday: ప్రధాని మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికలు కావాలా..? అయితే ఇలా చేయండి..
Modi Birthday
Follow us on

PM Narendra Modi Birthday: ప్రధాని నరేంద్రమోదీ నేటితో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని 20 రోజులపాటు వేడుకలను నిర్వహించేందుకు బీజేపీ, ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారంపాటు సేవా దివస్ గా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బీజేపీ.. ఈ సారి 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఇ-వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ రోజు నుంచి అక్టోబర్ 7 వరకూ ఈ-వేలం వేయనున్నట్లు కేంద్ర సాస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటనను విడుదల చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ వేలంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటివరకు అందుకున్న బహుమతులు, జ్ఞాపికలు ఉండనున్నాయి.

నుండి ఇ-వేలం ద్వారా వచ్చే ఆదాయం నమామి గంగే మిషన్‌కు వెళ్లనుంది. అయితే.. వేలం వేసే స్మారక చిహ్నాలలో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు బహూకరించిన పరికరాలు, జ్ఞాపికలు, అయోధ్య రామ మందిరం ప్రతిరూప పటాలు ఉన్నాయి. అయితే.. ఈ వేలంలో వ్యక్తులు/సంస్థలు వెబ్‌సైట్ ద్వారా పాల్గొనవచ్చు.. దీనికోసం https://pmmementos.gov.in సైట్‌లో సందర్శించాలని మంత్రిత్వశాఖ సూచించింది. ఈ వేలం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు జరుగుతుందని తెలిపింది. ఈ వేలంలో పలు పరికరాలు, అయోధ్య రామ మందిర ప్రతిరూపాలు, చార్ధామ్, రుద్రాక్ష కన్వెన్షన్ లాంటి నమూనాలు, శిల్పాలు, పెయింటింగ్‌లు, పలు వస్త్రాలు ఉన్నాయి. అయితే.. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగానది పరిరక్షణ కోసం స్థాపించిన నమామి గంగే మిషన్‌కు ఇవ్వనున్నారు.

కాగా.. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని 20 రోజులపాటు ఈ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2014వరకు కొనసాగారు. అనంతరం 2014 నుంచి రెండోసారి ప్రధానమంత్రిగా మోదీ సేవలందిస్తున్నారు. అయితే.. మోదీ సరిగ్గా 2001 అక్టోబర్‌ 7న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. ఈ వేడుకలు కూడా అక్టోబర్ 7వ తేదీతో ముగియనున్నాయి. మోదీ 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు 20 రోజులపాటు వేడుకలు నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ పిలుపునిచ్చింది.

Also Read:

PM Modi Birthday: 20 రోజులపాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఈ సారి అంత ప్రత్యేకం ఎందుకో తెలుసా..?

PM Narendra Modi Birthday: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం.. 71 వేల దీపాలతో శుభాకాంక్షల వెల్లువ.. అర్ధరాత్రి నుంచే..