ఒడిషాలో ఏనుగు కళేబరం కలకలం

| Edited By:

Aug 13, 2020 | 2:33 PM

ఒడిషాలో ఓ ఏనుగు కళేబరం కలకలం సృష్టించింది. రాష్టరంలోని సంబాల్‌పూర్‌ జిల్లాలోని ధామా అటవీ ప్రాంతంలోని కేషపల్లి గ్రామ సమీపంలో ఓ రెండున్నర ఏళ్ల ఏనుగు కళేబరం ప్రత్యక్షమైంది. ఇది చూసిన..

ఒడిషాలో ఏనుగు కళేబరం కలకలం
Follow us on

ఒడిషాలో ఓ ఏనుగు కళేబరం కలకలం సృష్టించింది. రాష్టరంలోని సంబాల్‌పూర్‌ జిల్లాలోని ధామా అటవీ ప్రాంతంలోని కేషపల్లి గ్రామ సమీపంలో ఓ రెండున్నర ఏళ్ల ఏనుగు కళేబరం ప్రత్యక్షమైంది. ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు చేరవేయడంతో.. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది.. ఏనుగు కళేబరాన్ని పోస్ట్ మార్టం చేయించారు. రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నెలలో కూడా ఓ ఏనుగు అనుమానాస్పద స్థతిలో మృతి చెందింది. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించగా.. బుల్లెట్ గాయంతో మరణించిందని తేలింది. ఇలా వరుసగా ఏనుగులు మృతిచెందడంపై అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి