Maharashtra News: సంజయ్ రౌత్‌ను ప్రశ్నిస్తున్న ED అధికారులు.. శరద్ పవార్‌కు IT నోటీసులు

|

Jul 01, 2022 | 12:28 PM

శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ఎదుట శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. పాత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Maharashtra News: సంజయ్ రౌత్‌ను ప్రశ్నిస్తున్న ED అధికారులు.. శరద్ పవార్‌కు IT నోటీసులు
Shiv Sena Mp Sanjay Raut (File Photo)
Follow us on

శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ఎదుట శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. పాత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు తాను ఈడీ విచారణకు ఇవాళ హాజరుకానున్నట్లు సంజయ్ రౌత్ ట్వీట్ శారు. సమన్లు ఇచ్చినందున విచారణకు సహకరించడం తన డ్యూటీగా ఆయన పేర్కొన్నారు. ఈడీ కార్యాలయం వద్దకు శివసేన కార్యకర్తలు ఎవరూ రావద్దని కోరారు. డోంట్ వరీ అంటూ శరద్ పవార్, ఉద్దవ్ థాకరే, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు.

ఇదిలా ఉండగా ఐటీ శాఖ నుంచి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు శుక్రవారంనాడు నోటీసులు అందాయి. 2004, 2009, 2014, 2020 ఎన్నికల అఫిడవిట్లలో శరద్ పవార్ చూపిన ఆస్తులకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఐటీ శాఖ ఆయనకు నోటీసులు పంపింది. ఐటీ శాఖ నుంచి తనకు ‘లవ్ లెటర్’ అందిందంటూ శరద్ పవార్ వెల్లడించారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న ఫలితం ఏంటో అందరికీ తెలుసన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి మహరాష్ట్ర ఎమ్మెల్యేలకు నోటీసులు అందుతున్నాయన్నారు. ఈడీ అంటే ఏంటో ఐదేళ్ల క్రితం వరకు ఎవరికీ తెలిసేది కాదని.. ఇప్పుడు గ్రామస్థుల కూడా ఈడీ గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని వాడుకోవడం కొత్త వ్యవహారమన్నారు.

మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ఐటీ శాఖ నుంచి శరద్ పవార్‌కు నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మెజార్టీ కోల్పోవడంతో బుధవారం రాత్రి ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఎంఏవీ కూటమి సర్కారు కుప్పకూలడంతో శివసేన రెబల్ నేత షిండే ఆ రాష్ట్ర 20వ సీఎంగా.. దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా గురువారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..