AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త కళ్లెదుటే పెద్ద పులికి బలైన భార్య.. దసరా వేళ హైదరాబాద్ బాలుడిపై చిరుత దాడి!

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వన్యప్రాణి దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరి పొలంలో పనిచేస్తున్న ఓ మహిళను పులి చంపగా, మరో ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ తక్షణమే ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భర్త కళ్లెదుటే పెద్ద పులికి బలైన భార్య.. దసరా వేళ హైదరాబాద్ బాలుడిపై చిరుత దాడి!
Tiger, Leopard
Balaraju Goud
|

Updated on: Oct 18, 2026 | 12:40 PM

Share

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వన్యప్రాణుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో పులి దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, చిరుత దాడిలో హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వరి పొలంలో పనిచేస్తుండగా మహిళపై పులి దాడి

చంద్రాపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని పళాస్‌గావ్ అటవీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉషా గురునులే (45) అనే మహిళ తన భర్తతో కలిసి వరి పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యపై పులి దాడి చేయడాన్ని చూసిన భర్త ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ భార్యను కాపాడలేకపోయాడు. భర్త కళ్ల ముందే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం, ప్రజల భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మహాకాళి ఆలయానికి వెళ్తుండగా బాలుడిపై చిరుత దాడి

మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కార్తిక్ జాదవ్ (9) అనే బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. దసరా సెలవుల సందర్భంగా చంద్రాపూర్ జిల్లా బల్లార్షాలోని తన మేనత్త ఇంటికి వచ్చాడు తొమ్మిదేళ్ల కార్తిక్. కుటుంబ సభ్యులతో కలిసి నవరాత్రుల సందర్భంగా చంద్రాపూర్‌లోని మహాకాళి ఆలయానికి కాలినడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో బల్లార్షా-చంద్రాపూర్ రహదారిపై విసాపూర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో చిరుత ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. అనంతరం అతడిని సమీపంలోని బొటానికల్ గార్డెన్‌లోకి లాక్కెళ్లింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు కేకలు వేస్తూ, కర్రలతో చిరుతను తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో బాలుడిని వదిలేసి చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది.

ఆసుపత్రిలో బాలుడికి చికిత్స

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంటపాటు వెతికిన అనంతరం బొటానికల్ గార్డెన్ అవుట్‌గేట్ సమీపంలో తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని గుర్తించారు. వెంటనే అతడిని చంద్రాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఒకే జిల్లాలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు, ప్రయాణికుల భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి. అటవీశాఖ అధికారులు దాడులు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి, ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!