Lpg gas cylinder price: భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!

|

Jun 01, 2022 | 7:24 AM

Lpg gas cylinder price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనాన్నిచ్చాయి చమురు కంపెనీలు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు

Lpg gas cylinder price: భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!
Lpg
Follow us on

Lpg gas cylinder price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనాన్నిచ్చాయి చమురు కంపెనీలు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు జూన్ 1న సవరించిన ధరల వివరాలను వెల్లడించాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.136 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 999.5 గా ఉంది. ముంబైలోనూ గ్యాస్ సిలిండర్ ధర రూ. 999.5 గా ఉంది. కోల్‌కతాలో ధర రూ. 1026, చెన్నైలో 1015.50గా ఉంది.

14 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.190 పెరిగింది..
ఏప్రిల్ 2021 నుండి ఇప్పటి వరకు LPG సిలిండర్ ధర 190 రూపాయలు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో కూడా ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకు ముందు అక్టోబర్ 6న దేశీయ గ్యాస్ ధర రూ.50 వరకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

గ్యాస్ సిలిండర్ ధరలను ఇలా చెక్ చేయండి..
LPG సిలిండర్ ధరను చెక్ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ IOC వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు జారీ చేస్తాయి. (https://iocl.com/Products/IndaneGas.aspx) ఈ లింక్‌లో మీరు మీ నగరంలోని గ్యాస్ సిలిండర్‌ల ధరను చెక్ చేసుకోవచ్చు.