Padma Awards: నేడే చివరి తేదీ.. సిఫారసు చేయండి.. గొప్పవారికి గుర్తింపునివ్వండి..

|

Sep 15, 2021 | 9:22 AM

పద్మ అవార్డ్స్-2022 కోసం ఆన్‌లైన్ నామినేషన్‌లు, సిఫార్సులు ఈ రోజుతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 15 వరకు ఈ నామినేషన్లకు అవకాశం ఉంటుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Padma Awards: నేడే చివరి తేదీ.. సిఫారసు చేయండి.. గొప్పవారికి గుర్తింపునివ్వండి..
Last Date For Nominations T
Follow us on

పద్మ అవార్డ్స్-2022 కోసం ఆన్‌లైన్ నామినేషన్‌లు, సిఫార్సులు ఈ రోజుతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 15 వరకు ఈ నామినేషన్లకు అవకాశం ఉంటుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్లలో సెలక్ట్ అయిన వారికి 2022 రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులు ప్రకటించబడతాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పద్మ అవార్డుల కొరకు నామినేషన్లు, సిఫార్సులు పద్మ అవార్డు పోర్టల్‌ అయిన https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడుతాయని స్పష్టం చేసింది. పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ల కోసం ప్రతి సంవత్సరం సిఫార్సులు ఇవ్వబడతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గ్రహీతల పేర్లు ప్రకటించబడతాయి.

‘‘పద్మ అవార్డులను ‘‘ప్రజల పద్మ’’ గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల పౌరులందరూ మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారి ప్రతిభ, విజయాలు నిజంగా ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించాలని, వారిని నామినేషన్లు/సిఫార్సులు చేయాలని’’ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నామినేషన్లు, సిఫారసులు పద్మ పోర్టల్‌లో లభించే ఫార్మాట్‌లో పేర్కొన్న అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సిఫారసు చేయబడిన వ్యక్తి అతను/ఆమె విశిష్ట, అసాధారణమైన విజయాలు, సేవను స్పష్టంగా తెలుపుతూ గరిష్టంగా 800 పదాలలో కథన రూపంలో తెలుపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ‘అవార్డులు, పతకాలు’ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

జనవరి 2, 1954 నుంచి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రజా సేవ చేసే వారికి ఈ అవార్డులను అందజేస్తారు. దేశంలో భారతరత్న తరువాత అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్. ఈ అవార్డును వైద్యులు, శాస్త్రవేత్తలు సహా ఏ రంగంలోనైనా అసాధారణ, విశిష్ట సేవ చేసే వారికి అందజేస్తారు. 2020 నాటికి 314 మందికి ఈ అవార్డులు ఇవ్వగా.. వీరిలో 17 మందికి మరణానంతరం, 21 మంది విదేశీ పౌరులకు ఇచ్చారు. ఇక పద్మభూషణ్ అవార్డును 2020 నాటికి మరణానంతరం 24 మందికి ప్రకటించగా.. 97 మంది విదేశీ పౌరులకు ప్రకటించారు. మొత్తం 1270 మందికి పద్మభూషణ్ అవార్డును ఇచ్చారు. ‘పద్మశ్రీ’ అవార్డలను 2020 నాటికి 3,123 మందికి ప్రకటించారు. కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, సైన్స్, క్రీడలు, ఔషధ రంగం, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు సహా వివిధ రంగాలలో విశిష్ట కృషికి గుర్తింపు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తూ వస్తోంది.

కాగా, ప్రతి సంవత్సరం ప్రధాన మంత్రి ఏర్పాటు చేసే పద్మ అవార్డుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. నామినేషన్ ప్రక్రియ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. స్వీమి నామినేషన్ కూడా వేసుకోవచ్చు. అయితే, ఈ సారి మాత్రం ప్రజలే నిర్ణేతలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీకు తెలిసిన ఉత్తమ ప్రజా సేవకులను పద్మ అవార్డులకు నామినేట్ చేయండి అంటూ పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి: Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..