Covid-19: నవోదయ పాఠశాలలో కరోనా కలకలం.. 101 మంది విద్యార్థులకు పాజిటివ్..

|

Dec 07, 2021 | 8:04 AM

Chikmagalur residential school: దేశంలో కరోనావైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో

Covid-19: నవోదయ పాఠశాలలో కరోనా కలకలం.. 101 మంది విద్యార్థులకు పాజిటివ్..
Students
Follow us on

Chikmagalur residential school: దేశంలో కరోనావైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కర్ణాటక చిక్కమంగళూరులోని జవహర్‌ నవోదయ పాఠశాలలోని రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. చెందిన హాస్టల్‌లో 101 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనావైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం 69 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో సోమవారం 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

పాఠశాలలో మొత్తం 90 మంది విద్యార్థులు, 11 మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు వెల్లడించారు. కాగా.. అన్ని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపటనున్నట్లు చిక్కమంగళూరు ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఉమేష్‌ వెల్లడించారు. అయితే వైరస్‌ బారినపడ్డ విద్యార్థులు, సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు ఏవీ కనిపించలేదని తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది అందరినీ అందరినీ పాఠశాలలోనే ఐసోలేట్ చేసినట్లు పేర్కొన్నారు.

దీంతో నవోదయ పాఠశాలను వారం పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 457 మంది విద్యార్థులు, సిబ్బంది శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశామని.. వారిలో 101 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పాఠశాల ప్రిన్స్‌పాల్ తెలిపారు. కాగా.. ఓకే పాఠశాలలో 100మందికిపైగా కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read:

Viral Video: ముందు సింహంలా గర్జించింది.. తీరా రింగులోకి దిగి గజగజ వణికింది.. ఫన్నీ వీడియో

Shocking Video: వామ్మో.. డేగ ‘వేట’ మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! వైరలవుతోన్న వీడియో