Juhi Chawla: సేవకు ఒప్పుకున్న బాలీవుడ్ నటి.. జరిమానాను భారీగా తగ్గించిన ఢిల్లీ హైకోర్టు.. అసలేమైందంటే..?

|

Jan 27, 2022 | 3:37 PM

Juhi Chawla 5G case: బాలీవుడ్ నటి జుహీ చావ్లా 5జీ నెట్‌వర్క్ కేసు గురువారం కొలిక్కి వచ్చింది. దేశంలో ఆరోగ్య ప్రమాదాల

Juhi Chawla: సేవకు ఒప్పుకున్న బాలీవుడ్ నటి.. జరిమానాను భారీగా తగ్గించిన ఢిల్లీ హైకోర్టు.. అసలేమైందంటే..?
Juhi Chawla
Follow us on

Juhi Chawla 5G case: బాలీవుడ్ నటి జుహీ చావ్లా 5జీ నెట్‌వర్క్ కేసు గురువారం కొలిక్కి వచ్చింది. దేశంలో ఆరోగ్య ప్రమాదాల దృష్ట్యా 5జీ (5G) వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ జుహీ చావ్లా.. పర్యావరణవేత్తలతో కలిసి గతేడాది ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై పలుమార్లు విచారించిన ధర్మాసనం.. జుహీ చావ్లా (Juhi Chawla)పై ఆగ్రహం వ్యక్తంచేసింది. 5జీతో ప్రజలు, జంతువులకు ముప్పు ఉందంటూ జుహీ చావ్లా చేసే ప్రచారం.. కేవలం పబ్లిసిటీ కోసమే నంటూ ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ఆమెపై 20 లక్షల జరిమానా సైతం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. జరిమానా తగ్గించాలన్న వినితిపై.. ధర్మాసనం స్పందించింది. ఏదైనా ప్రజాప్రయోజనం కోసం పనిచేస్తే.. కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ క్రమంలో జూహీ చావ్లా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DSLSA)తో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాలలో నటిస్తానని గురువారం (Delhi High Court) ధర్మసనానికి తెలిపింది. దీంతో ప్రచారం కోసం దావా వేసినట్లు నటి జూహీ చావ్లాపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తొలగించింది.

గురువారం వర్చువల్ ద్వారా జరిగిన విచారణలో ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జూహీ చావ్లా ప్రజాప్రయోజనం కోసం పనిచేస్తానని కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయమూర్తులు విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం చావ్లాపై విధించిన జరిమానా రూ.20 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించింది. ఆమె 5G సమస్యను సాధారణంగా అర్ధం చేసుకోలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్, సూచనలను తీసుకున్న తర్వాత జుహీ చావ్లా.. DSLSA చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ధర్మాసనానికి తెలియజేశారు.

జుహీ చావ్లా, ఇతర ఇద్దరు వేసిన దావాను కొట్టివేసిన సింగిల్ బెంచ్.. ఇలాంటి వాటివల్ల సమయం వృధాతప్ప ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడింది. దీనివల్ల కోర్టు కార్యకలాపాలకు పదే పదే అంతరాయం ఏర్పడిందని తెలిపింది.

Also Read:

Hyderabad: భాగ్యనగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. కరోనా సోకిందన్న భయంతో..

Hyderabad: కొడుకుని చూడనివ్వకుండా అడ్డుకున్న భర్త.. తీవ్ర మనస్తాపంతో భార్యఆత్మహత్య!