ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. ఆ దాడికి నిరసనగా ముంబైలో బాలీవుడ్ స్టార్స్ అంతా కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తా ప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, గేయ కవితలు చదువుతూ.. ఈ ప్రదర్శన సాగింది. దేశంలో విద్యార్థులపై ఇప్పటికే ఎన్నో దాడులు జరిగాయని, ఇక వీటికి స్వస్తి పలకాలని కోరుతున్న ప్లకార్డులు, పోస్టర్లను వీరు ప్రదర్సించారు. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ నిర్దేశకులని, వారికి ఉన్నతమైన ఫ్యూచర్ ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. అటు-మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం
జెఎన్ యు ఘటనను ఖండించింది. ఆ యూనివర్సిటీ విద్యార్థులకు, ఫ్యాకల్టీ సభ్యులకు మద్దతు ప్రకటించింది. 2008 లో ముంబైలో జరిగిన దాడితో ఈ నెల 6 వ తేదీన సంభవించిన ఘటనలను ప్రభుత్వం పోల్చింది. స్వయంగా సీఎం ఉధ్ధవ్ థాక్రే ఈ ఘటనపై స్పందిస్తూ.. నాటి దృశ్యాలను తాను టీవీలో చూశానని, అలాంటి ఘటనలను తమ రాష్ట్రంలో జరగనివ్వబోమని అన్నారు. ఢిల్లీ పోలీసులను ఆయన దుయ్యబట్టారు. పరిస్థితిని వారు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ఆయన విమర్శించారు. కాగా… బాలీవుడ్ సెలబ్రిటీలంతా.. ప్రదర్శన అనంతరం ‘ జనమనగణమన ‘ జాతీయ గీతం ఆలపించారు.
Carter Road,Bandra right now! Mumbai #ForTheStudents The politics of rage can only be stopped by love,not hate. ?❤️ pic.twitter.com/zzAG5OEbYz
— Pooja Bhatt (@PoojaB1972) January 6, 2020
Film director Anurag Kashyap, actor Dia Mirza, stand-up comedian Kunal Kamra taking part in protest against attack on students of JNU in Delhi at Carter Road in Bandra.#Mumbai#JNU #JNUattack @IndianExpress pic.twitter.com/24Dqid2Bdp
— laxman singh (@Laxmantweetsss) January 6, 2020
.@VishalBhardwaj at the silent protest of solidarity at Carter road, Mumbai against the #JNUattack pic.twitter.com/NtPKScfUdu
— Neeraj Ghaywan (@ghaywan) January 6, 2020